Raghurama: పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంది ఆయనే...

ABN , First Publish Date - 2023-03-31T14:40:02+05:30 IST

ఢిల్లీ: ఏపీ (AP)లో ఇసుకాసురా వైభవము.. ఇసుకను ఇష్టానుసారంగా అమ్ముకుంటూ, దోచుకుంటున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు.

Raghurama: పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంది ఆయనే...

ఢిల్లీ: ఏపీ (AP)లో ఇసుకాసురా వైభవము.. ఇసుకను ఇష్టానుసారంగా అమ్ముకుంటూ, దోచుకుంటున్నారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఇసుకపైన ఏడాదికి రూ. 1050 కోట్లు ఆర్జిస్తున్నారని.. ఆ భారం ప్రజలపై పడుతుందన్నారు. ఇసుక, మట్టిగుట్టలుగా ఎక్కడ ఉన్నా తవ్వుకుపోతున్నారని.. అమరావతిలో ఇసుక వ్యాపారం ఎవరెవరు చేస్తున్నారో తెలుస్తుందని.. ముఖ్యమంత్రి దగ్గర వ్యక్తే ఉన్నారని... విచారణకు ఆదేశిస్తారా? అని ప్రశ్నించారు.

ఇసుక దోచుకో, అమ్ముకో అనే విధంగా ఉందని, వైసీపీ (YCP) వాళ్లకు కొత్త ఆలోచనలు వస్తుంటాయని రఘురామ అన్నారు. సీఎం జగన్‌ (CM Jagan)కు అమావాస్యకు ఒకసారి పోలవరం (Polavaram), ప్రత్యేక హోదా (Special Status) గుర్తుకు వస్తుంటాయని ఎద్దేవా చేశారు. అమిత్ షా (Amit Shah)ను అర్ధరాత్రి కలిశారని.. అందులో అవినాష్ రెడ్డి (Avinash Reddy) అంశమే ఉంటుందని అనుకుంటున్నారన్నారు. ఏదో కోర్టులో వెసులుబాటు దొరికిందని.. కానీ కోర్టులో సీబీఐ (CBI) నెలరోజుల్లో విచారణ పూర్తి చేస్తామని చెప్పిందన్నారు. నిన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman)ను సీఎం జగన్ కలిసి ఒక వేంకటేశ్వర ఫోటో, శాలువా ఇచ్చారన్నారు. పోలవరంపై కేంద్రానికి లేఖ రాసింది జగన్ అని.. నడుస్తున్న ప్రాజెక్ట్‌ను అడ్డుకుంది ఆయనేనని... లేఖ రాయలేదని జగన్ గుండెపై చేయి వేసుకుని చెప్పాలన్నారు.

జగన్.. ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ అడిగితే సమయం లేదు వెళ్ళండి అని అన్నారని, ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చే సమయానికి కేసులు వస్తుంటాయని రఘురామ అన్నారు. పార్లమెంట్‌లో ఎప్పుడు కూడా ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీలు డిమాండ్ చేయలేదన్నారు. కాలర్ పట్టుకొని మరీ ప్రత్యేక హోదా అడుగుతామన్నారు. కానీ ఈ ప్రభుత్వం పార్లమెంట్‌లో అడిగింది ఒక్కటే.. తన అనర్హత వేటు అని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-03-31T14:40:02+05:30 IST