AP Govt.: బాండ్ల వేలం ద్వారా మళ్లీ అప్పు తెచ్చిన ఏపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-10-10T16:05:17+05:30 IST
అమరావతి: ఏపీ ప్రభుత్వం మంగళవారం మళ్లీ రూ. 450 కోట్ల అప్పు తెచ్చింది. ఆర్‌బీలో బాండ్ల వేలం ద్వారా 15 సంవత్సరాలకు గానూ 7.67 శాతం వడ్డీకి జగన్ సర్కారు అప్పు తీసుకుంది. ఈ అప్పుతో ఇప్పటివరకు ఎఫ్‌ఆర్‌బిఎం కింద ఏపీ రుణం రూ. 44 వేల 500 కోట్లకు చేరింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం (AP Govt.) మంగళవారం మళ్లీ రూ. 450 కోట్ల అప్పు (Rs.450 Crores Debt.) తెచ్చింది. ఆర్‌బీఐ (RBI)లో బాండ్ల వేలం ద్వారా 15 సంవత్సరాలకు గానూ 7.67 శాతం వడ్డీ (7.67 percent interest)తో జగన్ సర్కారు (Jagan Govt.) అప్పు తీసుకుంది. ఈ అప్పుతో ఇప్పటివరకు ఎఫ్‌ఆర్‌బిఎం (FRBM) కింద ఏపీ రుణం రూ. 44 వేల 500 కోట్లకు చేరింది. ఇవి కాకుండా, మరో రూ. 23 వేల కోట్లు కార్పొరేషన్‌ల ద్వారా ప్రభుత్వం అప్పు తెచ్చింది. ఏడు నెలల్లో 67 వేల 500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని సర్కార్ ఊడ్చేసింది. మళ్లీ కొత్త రుణ పరిమితి ఇస్తేనే ఏపీ ప్రభుత్వానికి బాండ్ల వేలానికి అనుమతి ఉంటుంది.