MLC Electionsల్లో అక్రమాలపై సీఈసీకి చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2023-03-13T12:57:39+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై సీఈసీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

MLC Electionsల్లో అక్రమాలపై సీఈసీకి చంద్రబాబు లేఖ

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై సీఈసీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల్లో పలు అక్రమాలను, ఉల్లంఘనలకు వివరించి తక్షణ చర్యలు కోరుతూ లేఖ రాశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వైసీపీ తీవ్రంగా ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రి ఉషా శ్రీచరణ్‌ని డబ్బుల పంపిణీపై క్యాడర్‌కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడిందని.. ఓటుకు రూ.1000 పంచాలని స్వయంగా మంత్రి చెప్పారని మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి ఎంపీ మిథున్ రెడ్డి కడప క్రాస్ నుంచి తంబళ్లపల్లి వరకు ర్యాలీ నిర్వహించారని తెలిపారు. 48 గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉన్నా... ఆ నిబంధనలు ఎంపీ ఉల్లంఘించారన్నారు.

లేఖలోని అంశాలు...

  • విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని వార్డు నెం. 16, బూత్ నంబర్ 232లో వైసీపీ అనుచరుడు ఈశ్వరరావు డబ్బు పంపిణీ చేస్తూ పట్టుబడ్డారన్నారు.

  • తిరుపతి పట్టణంలో 9వ తరగతి విద్యార్హత కలిగిన విజయ అనే మహిళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్రమ ఓటు వేశారన్నారు.

  • ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో YSRCP అనుచరులు రమణ మహర్షి స్కూల్ వద్ద డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు

  • తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ పోలింగ్ బూత్‌లలోకి అక్రమంగా ప్రవేశించారు.

  • పోలింగ్ బూత్ నెం. 233, 233ఏ లలోకి అక్రమగా ప్రవేశించడమే కాకుండా టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.

  • బోగస్ ఓట్లపై ప్రశ్నించిన టీడీపీ నేత దేవనారాయణరెడ్డిని అక్రమంగా పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు.

  • ఒంగోలు పట్టణంలో టీడీపీ టెంట్ వేయడానికి అంగీకరించని పోలీసులు వైసీపీ నాయకులకు మాత్రం అనుమతి ఇచ్చారు.

  • విశాఖలోని 53వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బర్కత్ అలీ ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ వీడియోలో పట్టుబడ్డారు

  • బోగస్ ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తిరుపతి పట్టణంలో టీడీపీ నేతలు నర్సింహ యాదవ్, ఇతర నేతలను అరెస్టు చేశారు.

  • వైసీపీ బోగస్ ఓట్లకు సహకరించేందుకే పోలీసులు ఈ అరెస్టులు చేస్తున్నారు

  • తిరుపతి పట్టణంలో వైసీపీ బోగస్ ఓట్లను ప్రశ్నించిన టీడీపీ నాయకుడు, పోలింగ్ ఏజెంట్ పులిగోరు మురళిని అక్రమంగా అరెస్టు చేశారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఈ ఘటనలకు సంబంధించి ఆధారాలు పంపుతున్నట్లు చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-03-13T12:57:39+05:30 IST