Bonda Uma: ‘ఈ రోజు నీది అంటున్న జగన్, వంశీ.. రేపు ఉందని గుర్తుపెట్టుకోండి’
ABN , First Publish Date - 2023-02-21T11:16:04+05:30 IST
జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం కూని అయిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ విమర్శలు గుప్పించారు.
అమరావతి: జగన్ (YS Jagan Reddy) అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ (TDP Leader Bonda Uma) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీ నేత, మాజీ సీఎం ఇంటిపై దాడి చేశారని... ప్రతిపక్ష పార్టీ ఆఫీస్‌లపై కూడా దాడులు చేస్తున్నారన్నారు. పోలీసులు ప్రమోషన్‌ల కోసం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని మండిపడ్డారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ప్రజల్లోకి వెళితే హారతులు పడుతున్నారన్నారు. దీన్ని చూసి సైకో జగన్ (AP CM) ఫ్రస్ట్రేట్ అయిపోయారని... చంద్రబాబు (TDP Chief) టూర్‌లకు అనేక ఆటంకాలు కలిగిస్తున్నారని అన్నారు. తూర్పు గోదావరిలో బాబు మీటింగ్ వచ్చిన ఆదరణ చూసి జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కి జ్వరం వచ్చిందన్నారు. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తిని లైట్‌లు తీసేసి.. 7 కిలోమీటర్లు నడిపించారని దుయ్యబట్టారు. నిన్న గన్నవరంలో టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అరాచకాలను ప్రశ్నించడం తప్పా అని ప్రశ్నించారు. లొసుగులను మీడియా సాక్షిగా బయట పెడతాం తప్పా అంటూ టీడీపీ నేత నిలదీశారు.
‘‘ఆ గొట్టం గాడు గన్నవరం వంశీ నీ చూసి ఎవ్వరైనా భయపడతారు అనుకుంటున్నావా. వంశీ (Vallabhaneni Vamshi) అవినీతిపై విచారించాల్సినది పోయి పార్టీ ఆఫీస్‌పై దాడి చేస్తారా. నిన్న చిన్న ఇంటిపై దాడి జరిగితే ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే అరెస్ట్ చేస్తారా. ఈ నిముషం వరకు పట్టాభి ఎక్కడ ఉన్నాడో తెలియదు. అసలు పట్టాభి (Kommareddy Pattabhi) ఏ స్టేషన్‌లో ఉన్నాడు, అసలు వున్నాడా లేదా. గన్నవరంలో ఏం జరిగింది అనేది పోలీసులు మాట్లాడరు. టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేశారు. కార్‌ను తగులబెట్టారు. మహిళ కార్యకర్తలను అరెస్ట్ చేసి రాత్రి అంతా మగ పోలీసులే కస్టడీలో పెట్టారు. నిన్న గన్నవరంలో పోలీసులే వైసీపీకి రక్షణగా ఉండి దాడులు చేయించారు. టీడీపీ హయాంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా. జగన్, డీజీపీ మాట్లాడాలి, కృష్ణ ఎస్‌పీ లీవ్‌లో వెళ్ళిపోండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
చెరువులను కబ్జా చేసినా సీఎం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఇలాంటి రౌడీలను, ఎమ్మెల్యేలను ఎందుకు ఉపేక్షిస్తున్నారని నిలదీశారు. వైసీపీ గుండాలు నిన్న 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇష్టారీతిన దాడులు చేశారని అన్నారు. ‘‘వైసీపీని హెచ్చరిస్తున్నాం.. ఈ రోజు నీది అంటున్న జగన్, వంశీలు రేపు ఉందని గుర్తు పెట్టుకోవాలి. పోలీసులు కూడా గుర్తు పెట్టుకొని ఇలాంటి గాలి వెధవలకు, గాలి పార్టీలకు జీ హుజూర్ అంటే మీరు ఇబ్బంది పడతారు’’. గన్నవరంలో నిన్న ఉన్న పోలీసులపై ప్రైవేట్ కేసులు వేయనున్నట్లు తెలిపారు. పోలీసులకు లా అండ్ ఆర్డర్ చేతకాకపోతే వదిలేయాలన్నారు. వంశీ అరాచకాలను బయట పెడుతున్నామని టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారని అన్నారు. పట్టాభి ఎక్కడ ఉన్నారో ఇప్పటికీ తెలియలేదన్నారు. అరెస్ట్ చేస్తే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని కోరుతున్నట్లు బోండా ఉమా పేర్కొన్నారు.