RIP Viswanath: కళాతపస్వి మృతిపై చంద్రబాబు, లోకేష్ దిగ్భ్రాంతి
ABN , First Publish Date - 2023-02-03T09:10:11+05:30 IST
ప్రముఖ సినీ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూతపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి: ప్రముఖ సినీ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత (Film Director, Kalathapaswi K. Vishwanath Passes Away)పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Lokesh) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ (RIP K Viswanath) మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటన్నారు. విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు (TDP Chief) ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన దిగ్గజదర్శకుడు...
కళా తపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూయడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటని లోకేష్ (Nara Lokesh) అన్నారు. అత్యద్భుత చిత్రాలని తెరకెక్కించి, తెలుగు చలనచిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన దిగ్గజదర్శకుడు దివంగతులవడం చాలా బాధాకరమన్నారు. కళాతపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థించారు. వారి కుటుంబసభ్యులకు లోకేష్ ప్రగాఢ సంతాపం తెలిపారు.
ప్రముఖ సినీ దర్శకులు కె.విశ్వనాథ్ (K Viswanath) గతరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అపోలో ఆస్పత్రి (Apollo Hospital)లో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఆస్పత్రలోని తుదిశ్వాస విడిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించారు. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వత్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. కె.విశ్వనాథ్‌కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు