TDP: మైలవరంలో ఉద్రిక్తత... తెలుగు తమ్ముళ్ల అరెస్ట్
ABN , First Publish Date - 2023-09-09T21:16:09+05:30 IST
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో(Mylavaram) తెలుగు తమ్ముళ్లు నిరసనలు చేపట్టారు.
ఎన్టీఆర్ జిల్లా: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పై ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో(Mylavaram) తెలుగు తమ్ముళ్లు నిరసనలు చేపట్టారు. మైలవరం అంబేడ్కర్ విగ్రహం ఎదుట తెలుగు యువత అధ్యక్షులు లంక లితిష్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. ధర్నా చేస్తున్ననేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిని అరెస్ట్ చేసే క్రమంలో తోపులాట జరిగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బలవంతంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి మైలవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మైలవరం పోలీస్ స్టేషన్ ఎదుట కొంతమంది టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. కాగా ఉదయం సమయంలో తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారని, ఎన్ని గంటలు తమను స్టేషన్‌లో ఉంచుతారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల మొండి వైఖరీ నశించాలని నాయకులు నినాదాలు చేశారు. పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.