Vijayawada: టీడీపీలో చేరేందుకు వైసీపీ నాయకుడు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2023-02-08T16:29:46+05:30 IST

విజయవాడ: కృష్ణలంకకు చెందిన వైసీపీ నాయకుడు (YCP Leader) గోగుల రమేష్ (Gogula Ramesh) టీడీపీ (TDP)లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Vijayawada:  టీడీపీలో చేరేందుకు వైసీపీ నాయకుడు ఏర్పాట్లు

విజయవాడ: కృష్ణలంకకు చెందిన వైసీపీ నాయకుడు (YCP Leader) గోగుల రమేష్ (Gogula Ramesh) టీడీపీ (TDP)లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన అభిమానులతో కలిసి చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో రమేష్‌ను వైసీపీ నేతలు బెదిరించారు. దీంతో అరవ సత్యం (Arava Satyam), దేవినేని అవినాష్ (Devineni Avinash), అతని అనుచరులపై టీడీపీ నేతలు (TDP Leaders) గద్దె రామ్మోహన్ (Gadde Rammohan), బుద్దా వెంకన్న (Buddha Venkanna) సీపీకి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్బంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ..

గోగుల రమేష్ 2019 ఎన్నికలలో వైసీపీ నాయకుడిగా పని చేశారని, మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వ పాలన నచ్చక టీడీపీలో చేరేందుకు ముందుకు వచ్చారన్నారు. తాను, వంగవీటి రాధా (Vangaveeti Radha) కలిసి చంద్రబాబుకు ఈ మేరకు సమాచారం ఇచ్చామన్నారు. తమ అధినేత సమక్షంలో త్వరలోనే రమేష్ పసుపు కండువా కప్పుకోనున్నారని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు చంపుతామని రమేష్‌ను బెదిరించడం దుర్మార్గమన్నారు. ఈ పరిణామాలను పోలీసు కమిషనర్‌ను కలిసి వివరించామన్నారు. అన్నీ విచారించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారని గద్దె రామ్మోహన్ తెలిపారు.

బుద్దా వెంకన్న మాట్లాడుతూ..

టీడీపీలో చేరాలనుకున్న నాయకులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, దేవినేని అవినాష్, అతని అనుచురుడు అరవ సత్యంతో కలిసి రమేష్‌ను చంపుతామని హెచ్చరిస్తున్నారన్నారు. పోలీసులకు కూడా ఈ ఘటనలపై రమేష్ ఫిర్యాదు చేశారన్నారు. హత్య కేసుల్లో అరవ సత్యం ఇప్పటికే నిందితుడిగా ఉన్నాడని, పోలీసులను కూడా తప్పుదోవ పట్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవలే కృష్ణలంకలో మహిళలపై దాడులు చేసి, అదే మహిళపై కేసులు పెట్టించారన్నారు. విజయవాడలో పాత పరిస్థితి తీసుకువచ్చేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ ఘటనల నేపధ్యంలో పోలీసు కమిషనర్‌ను కలిసి వారి అరాచకాలను వివరించామన్నారు. ‘వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోండి.. రాజకీయం చేయండి తప్పు లేదు.. భయపెట్టి, బెదిరిస్తామంటే.. భవిష్యత్‌లో మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు’ అని బుద్దా వెంకన్న హెచ్చరించారు.

Updated Date - 2023-02-08T16:29:49+05:30 IST