YCP MLA: సీపీఐ, టీడీపీని వెల్లంపల్లి ఎంతమాట అన్నారో చూడండి...

ABN , First Publish Date - 2023-04-11T11:47:11+05:30 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, టీడీపీపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

YCP MLA: సీపీఐ, టీడీపీని వెల్లంపల్లి ఎంతమాట అన్నారో చూడండి...

విజయవాడ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna), టీడీపీపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు (MLA Vellampalli Srinivas rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దనున్న పూలే విగ్రహానికి వైసీపీ ఎమ్మెల్యేలు నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ.. సీపీఐ రామకృష్ణ డబ్బులకు అమ్ముడుపోయిన వ్యక్తి అని విమర్శించారు. టీడీపీ (TDP)కి అమ్ముడు పోయిన పార్టీ సీపీఐ (CPI) అని అన్నారు. డబ్బుల కోసం అమ్ముడుపోయారు కాబట్టే సీపీఐ నాయకులకు ఈ రోజు ఏగతి పట్టిందో అందరూ చూస్తున్నారని తెలిపారు. దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu)అని... మైనార్టీలపై దేశద్రోహం కేసు పెట్టిన వ్యక్తి చంద్రబాబు (TDP Chief) అంటూ విరుచుకుపడ్డారు. బీసీలు, ఎస్సీలకు రాజ్యాధికారం ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) ప్రభుత్వం (AP Government) అని గుర్తుచేశారు. తమ సీఎంను ఆడిపోసుకోవాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. సీపీఐ రామకృష్ణ, చంద్రబాబు వంటి దుష్టులు, దుర్మార్గులు ఈ రాష్ట్రానికి అవసరం లేదని వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు.

ఈ కార్యక్రమంలో వెల్లంపల్లి సహా మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొని జ్యోతిరావు పూలేకు నివాళులర్పించారు.

Updated Date - 2023-04-11T11:47:11+05:30 IST