Bhuma Akhilapriya: వివేకా హత్య కేసు.. అరెస్టులు ఇంతటితో ఆగవు...

ABN , First Publish Date - 2023-04-16T10:42:14+05:30 IST

కర్నూలు జిల్లా: సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ..

Bhuma Akhilapriya: వివేకా హత్య కేసు.. అరెస్టులు ఇంతటితో ఆగవు...

కర్నూలు జిల్లా: సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పందించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. రాజకీయం కోసం సొంత కుటుంబ సభ్యులనే చంపడం విచారకరమని అన్నారు. ఈ అరెస్టులు ఇంతటితో ఆగవన్నారు. ఏ తప్పు చేయనప్పుడు భయం ఎందుకని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో కథ చెప్పారని.. అప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్ధమైందన్నారు. అరెస్టుల పర్వం తాడేపల్లిలోని లాస్ట్ వ్యక్తి వరకు వెళ్తాయని అనుకుంటున్నానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. విచారణ, అరెస్టులపై వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా.. లేనప్పుడు మరోలాగా మాట్లాడతారని.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగాలని కోరుకుంటున్నానని భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు.

కాగా వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వస్తోంది. తాజాగా ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని ఆదివారం తెల్లవారుజామున విచారించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం సీబీఐ మేజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరు పరచనున్నారు. భాస్కర్రెడ్డి అరెస్ట్ మెమోను ఆయన భార్య లక్ష్మీకి అందజేశారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

Updated Date - 2023-04-16T10:42:14+05:30 IST