Home » Bhuma Akhila Priya
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సాక్షి దినపత్రికపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాక్షి ఆఫీసు వద్ద ధర్నాకు దిగారు. సాక్షి యాజమాన్యంపై పరువు నష్టం దావా వేస్తానంటూ మండిపడ్డారు.
Mandipalli Ramprasad Reddy: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విచారణ చేస్తున్నామని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.
నంద్యాల: విజయ డైరీ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. నామినేషన్ల ప్రక్రియ సరిగా జరగడంలేదంటూ భూమా అఖిలప్రియ వర్గం నిరసన చేపట్టింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ఉత్కంఠంగా మారింది. నిరసన తెలుపుతున్న భూమా అనుచరులు గేట్లు తెరుచుకుని లోపలికి రావటానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
విదేశాల నుంచి పరిశ్రమలు తెచ్చి ఏపీని అభివృద్ధి చేయడానికి అటు సీఎం చంద్రబాబు.. ఇటు మంత్రి నారా లోకేష్ ఎంతో కష్ట పడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం ఆబద్ధపు మాటలకే పరిమితమైందని భూమా అఖిలప్రియ మండిపడ్డారు.
కర్నూల్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె మామ జగన్ మోహన్ రెడ్డి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.
కర్నూల్ జిల్లాలో రాజకీయం హీటెక్కింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. మామ జగన్ మోహన్ రెడ్డికి, అఖిలప్రియ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరగడంతో కర్నూల్ రాజకీయాలు ఉద్రిక్తంగా మాారాయి.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. తాజాగా నంద్యాలలో ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రులు బిసి జనార్ధన్ రెడ్డి, ఎన్‌ఎమ్‌డి ఫరూక్, ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ జగన్‌పై విరుచుకుపడ్డారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ..
జిల్లాలోని మసీదుపురం మెట్ట వద్ద రౌడీషీటర్ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. అల్లూరి వెంకటసాయి అలియాస్ కవ్వా సాయి అనే రౌడీ షీటర్‍ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో వేటాడి మరీ దారుణంగా హతమార్చారు.
ఆళ్లగడ్డలో టీడీపీ నేత అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి(Sridevi) హత్య గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. కళ్లల్లో కారం చల్లి మరీ బండరాళ్లతో మోది చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya) బాడీగార్డ్పై హత్యాయత్నం కేసు నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.