Battery vehicles: శ్రీశైలం మల్లన్న భక్తుల కోసం ఉచిత బ్యాటరీ వాహనాలు
ABN , First Publish Date - 2023-06-03T15:12:53+05:30 IST
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉచిత బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. మల్లన్న దర్శించుకోడానికి వచ్చే సామాన్య భక్తుల కోసం ఈ ఉచిత బ్యాటరీ వాహనాలను దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది.
నంద్యాల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉచిత బ్యాటరీ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. మల్లన్న దర్శించుకోడానికి వచ్చే సామాన్య భక్తుల కోసం ఈ ఉచిత బ్యాటరీ వాహనాలను దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది. వికలాంగులు, దివ్యాంగులు, వృద్ధులకు క్షేత్ర పరిధిలోని బస్టాండు నుంచి క్యూలైన్ల వరకు ఉచిత బ్యాటరీ వాహన సదుపాయాన్ని దేవస్థానం కల్పించింది. సామన్య భక్తులు కోసం పంచమాఠాలు సందర్శించేందుకు ఉచిత బ్యాటరీ వాహనాల సర్వీసు శ్రీశైలం దేవస్థానం ప్రారంభించింది. ముందుగా ఐదు బ్యాటరీ వాహనాలకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. రెండు వాహనాలు బస్టాండు నుంచి క్షేత్ర పరిధిలో దివ్యాంగులు, వృద్ధులు, వికలాంగులకు దేవస్థానం అందుబాటులో ఉంచింది. మరో మూడు వాహనాలు క్షేత్ర పరిధిలోని పంచమఠాల సందర్శనానికి సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచాలమని ఈవో లవన్న వెల్లడించారు.