Kurnool: రూ.2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికి మోసం..

ABN , First Publish Date - 2023-09-08T13:14:50+05:30 IST

కర్నూలు: రూ. 2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికారు. తమ వద్ద ఉన్ననోట్లకు మారుగా రూ. 5 వందల నోట్లు ఇస్తే 15 శాతం కమీషన్ కలిపి ఇస్తామంటూ ఓ గ్యాంగ్ మోసానికి స్కేచ్ వేశారు. పథకం ప్రకారం సినీ పక్కీలో నగదు తీసుకువెళ్లారు.

Kurnool: రూ.2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికి మోసం..

కర్నూలు: రూ. 2వేల నోట్లు రద్దవుతున్నాయని నమ్మబలికారు. తమ వద్ద ఉన్ననోట్లకు మారుగా రూ. 5 వందల నోట్లు ఇస్తే 15 శాతం కమీషన్ కలిపి ఇస్తామంటూ ఓ గ్యాంగ్ మోసానికి స్కేచ్ వేశారు. పథకం ప్రకారం సినీ పక్కీలో నగదు తీసుకువెళ్లారు. ఘరానా మోసానికి పాల్పడిన నిందితులను ఎట్టకేలకు నంద్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

శ్రీకాకుళం జిల్లా, సరుబుజ్జిలి మండలం, తెలికిపెంట గ్రామానికి చెందిన శోభన్‌బాబు, నందిగాం మండలం దేవపురం గ్రామానికి చెందిన చిన్నబాబు.. మరో ఆరుగురు కలిసి జులై 20న నంద్యాల మండలం, నూనెపల్లెకు చెందిన శ్రీనివాసరెడ్డి, అతని స్నేహితులను పరిచయం చేసుకున్నారు. త్వరలో రూ. 2వేల నోట్లు రద్దవుతున్నాయని తమవద్ద ఆ నోట్లు చాలా ఉన్నాయని చెప్పారు. ఎవరైన తమకు రూ. 5వందల నోట్లు ఇస్తే వారికి 15 శాతం కమీషన్‌తో కలిసి రూ. 2వేల నోట్లు ఇస్తామని నమ్మబలికారు. కమీషన్‌కు ఆశపడిన శ్రీనివాస్ రెడ్డి అతని స్నేహితులు రైతునగరం గ్రామం వద్దకు రూ. 5వందల నోట్లు తీసుకుని వెళ్లారు. అక్కడ నిందితులు రూ. 2కోట్ల 20 లక్షల విలువైన రూ. 5 వందల నోట్లు తీసుకుని పరారయ్యారు. దీనిపై శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం సాయంత్రం నిందితులను విశాఖలో అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 70 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా ఆరుగురు నిందితులను పట్టుకోవాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2023-09-08T13:14:50+05:30 IST