YuvaGalam: లోకేష్ యువగళం పాదయాత్రకు జన నీరాజనం.. మహిళా రైతుకు యువనేత అభయం
ABN , First Publish Date - 2023-04-18T09:42:31+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు.
కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)కు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు పెద్ద ఎత్తున లోకేష్ (Nara Lokesh) పాదయాత్రకు తరలివస్తున్నారు. యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు (TDP Leader) మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. జగన్ ప్రభుత్వంలో (Janga Government) తాము పడుతున్న బాధలను ప్రజలు లోకేష్‌కు వివరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సమస్యలు తీర్చుతామంటూ లోకేష్ పాదయాత్రలో (Lokesh Padayatra) హామీలు ఇస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర (YuvaGalam Padayatra) ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.
మంగళవారం ఉదయం పల్లెదొడ్డి క్యాంప్ సైట్ నుంచి 74వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం వలగొండ క్రాస్ వద్ద బహిరంగ సభలో లోకేష్ మాట్లాడనున్నారు. పాదయాత్రలో భాగంగా పల్లెదొడ్డి గ్రామంలో మహిళా రైతు నాగమ్మ నిర్వహిస్తున్న గొర్రెల ఫామ్‌ను పరిశీలించారు. రైతు నాగమ్మ, భర్త కృష్ణన్న గౌడ్‌తో మాట్లాడి గొర్రెల పెంపకంలో వారు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్లుగా షెడ్ ఏర్పాటు చేసుకొని గొర్రెల ఫామ్ నిర్వహిస్తున్నామని, షెడ్ నిర్మాణానికి రెండున్నర లక్షల ఖర్చు అయ్యిందని తెలిపారు. మొదటి ఏడాది 50 గొర్రెలతో ఫామ్ ప్రారంభించామని చెప్పారు. రెండేళ్లలో రెండు లక్షల నష్టం రావడంతో ప్రస్తుతం 30 గొర్రెలు మాత్రమే పెంచుతున్నామని మహిళా రైతు తెలిపారు. ఏడాదికి మేత, దాణా, మందులు, ఇతర ఖర్చులు సుమారుగా రెండు లక్షలు అవుతుందన్నారు. ఇంత కష్టం చేస్తే రోజు కూలీ మాత్రమే మిగులుతుందని వాపోయారు. ప్రభుత్వం నుంచి షెడ్ నిర్మాణం, మేత, దాణా, మందులు కొనడానికి ఎటువంటి సహాయం, సబ్సిడీలు రావడం లేదు అంటూ మహిళా రైతు నాగమ్మ కన్నీరు పెట్టుకున్నారు.
అయితే మహిళా రైతు సమస్యలు విన్న లోకేష్ వారికి అభయమిచ్చారు. అధైర్య పడొద్దు అంటూ నాగమ్మకు ధైర్యం చెప్పారు. అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎంత ప్రమాదమో కల్లారా చూస్తున్నానన్నారు. గొర్రెల పెంపకం కోసం టీడీపీ పాలనలో అనేక చర్యలు తీసుకున్నామన్నారు. గొర్రెలు కొనడానికి సబ్సిడీ రుణాలు అందించామని... మేత, దాణా, మందులు అన్ని సబ్సిడీ ధరకి అందించామని గుర్తుచేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం గొర్రెల పెంపకానికి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వడం లేదన్నారు. టీడీపీ హయాంలో షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ రుణాలు అందించామని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసి మినీ గోకులంలు ఏర్పాటు చేశామని చెప్పారు. కనీసం గొర్రెల పెంపకం కోసం తాగునీరు అందించలేని పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సబ్సిడీతో షెడ్ల నిర్మాణం కోసం రుణాలు అందించి గొర్రెల ఫామ్ నిర్వహణకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. మందులు, ఫీడ్ అన్ని తక్కువ ధరకు అందించి గొర్రెల పెంపకంలో రైతులకి లాభం వచ్చేలా చేస్తాం అంటూ లోకేస్ ధైర్యం చెప్పారు.