YuvaGalam Padayatra: 90వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు

ABN , First Publish Date - 2023-05-05T09:59:45+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 90వ రోజుకు చేరుకుంది.

YuvaGalam Padayatra: 90వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర మొదలు

కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader NaraLokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 90వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం జిల్లాలోని పాణ్యం నియోజకవర్గం పెద్దకొట్టాల నుంచి 90వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఈరోజు కె.మార్కాపురంలో రైతులతో లోకేష్ సమావేశంకానున్నారు. అనంతరం కె. మార్కాపురం - కర్నూలు రోడ్డులో కురువలతో భేటీ అవనున్నారు. ఆపై సల్కాపురంలో యువతతో లోకేష్ సమావేశం అవుతారు. సాయంత్రం పెద్దపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడనున్నారు.

కాగా.. నిన్న 89వ రోజు పాణ్యం అసెంబ్లీ నియోజవర్గం రేమడూరు విడిది కేంద్రం నుంచి యువగళం పాదయాత్ర మొదలైంది. పుసులూరు, బొల్లవరం, బస్తిపాడు, చినకొట్టాల,పెదకొట్టాల మీదుగా సాగిన పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. వాల్మీకి బోయలు, ఎస్సీలు, వివిధ గ్రామాల ప్రజలు తమ సమస్యలను లోకేష్‌కు వివ‌రించారు. బొల్లవరంలో మహిళలతో ముఖాముఖి సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. బొల్లవరం శివార్లలో కౌలు రైతులను కలిసి వారి సమస్యలు విన్నారు. రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని భ‌రోసా ఇస్తూ యువనేత లోకేష్ ముందుకు సాగారు.

Updated Date - 2023-05-05T09:59:45+05:30 IST