YCP Minister: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై మంత్రి మేరుగ నాగార్జున ఫైర్
ABN , First Publish Date - 2023-11-22T19:20:42+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సందర్భంలో పురందేశ్వరి స్వాగతించటంలో తప్పులేదని, చంద్రబాబు వదిన కావటం వల్ల స్వాగతించి ఉండవచ్చన్నారు. పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిగా పెట్టింది చంద్రబాబు కుటుంబం కోసమేనని మండిపడ్డారు.
ప్రకాశం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సందర్భంలో పురందేశ్వరి స్వాగతించటంలో తప్పులేదని, చంద్రబాబు వదిన కావటం వల్ల స్వాగతించి ఉండవచ్చన్నారు. పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిగా పెట్టింది చంద్రబాబు కుటుంబం కోసమేనని మండిపడ్డారు.
"చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సందర్భంలో పురందేశ్వరి స్వాగతించటంలో తప్పులేదు. చంద్రబాబు వదిన కావటం వల్ల స్వాగతించి ఉండవచ్చు. పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిగా పెట్టింది చంద్రబాబు కుటుంబం కోసమే. ఆమె ఇటీవలి కాలంలో మా ప్రభుత్వంపై కర్కశత్వంతో మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ మధ్యపాన నిషేదం చేయాలని నిర్ణయం తీసుకుంటే.. చంద్రబాబు మద్యాన్ని ఏరులై పారించారు." అని మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు.