జగనన్న అద్భుత పాలనకు అదే నిదర్శనం: రోజా
ABN , First Publish Date - 2023-04-11T16:36:19+05:30 IST
జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో మంత్రిగా సంవత్సరం పూర్తి చేసుకోటం జరిగిందని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి రోజా పేర్కొన్నారు.
విజయవాడ : జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో మంత్రిగా సంవత్సరం పూర్తి చేసుకోటం జరిగిందని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి రోజా పేర్కొన్నారు. రాష్ట్రంలో సాంస్కృతిక శాఖా మంత్రిగా పని చేసిన సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా జగనన్న పాలన అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రసిద్ది చెందిన ఆలయాలు ఉన్నాయని వాటిలో పర్యాటక కేంద్రాలు ఉన్నవాటిని అభివృద్ధి చేసి భద్రత కలిపిస్తున్నారని రోజా పేర్కొన్నారు. అలాగే జగనన్న పుట్టిన రోజు సందర్భంగా స్వర్ణోత్సవ సాంస్కృతిక క్రీడల వారోత్సవాలు నిర్వహించటం జరిగిందన్నారు. రాష్ట్రంలో క్రీడలకు పెద్ద పీట వేసిన ఘనత జగనన్న పాలన అని సగౌరవంగా చెప్పుకోవచ్చన్నారు. అంధ్రప్రదేశ్లో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సదస్సులో పర్యాటక శాఖలోనే ఎక్కువ ఎంవోయూలు జరిగాయని రోజా పేర్కొన్నారు. యూత్ ఫెస్టివల్ చేస్తూ యువతని ప్రగతి మార్గంలో నడపటం జగనన్న అద్భుత పాలనకు నిదర్శనమని రోజా పేర్కొన్నారు. టూరిజంలో 2023ని ఇయర్ ఆఫ్ విజిట్గా నిర్వచించారు. రాష్ట్రంలో మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. అరకు, లంబసింగి వంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఇంకా వాటిని అభివృద్ధి చేసి వచ్చే పర్యాటకులకు భద్రత కల్పించే దిశలో ప్రభుత్వం ఉందని రోజా పేర్కొన్నారు.