Kakani Govardhan Reddy : మంత్రి కాకాణి సొంత ఇలాకాలో మరో భారీ కుంభకోణం

ABN , First Publish Date - 2023-09-01T08:26:20+05:30 IST

మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత ఇలాకాలో మరో భారీ కుంభకోణం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.10కోట్ల నక్కలవాగు పనులకి ఇరిగేషన్ శాఖ అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లకి ఈ నెల 5 వరకూ గడువు ఇచ్చారు.

Kakani Govardhan Reddy : మంత్రి కాకాణి సొంత ఇలాకాలో మరో భారీ కుంభకోణం

నెల్లూరు : మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత ఇలాకాలో మరో భారీ కుంభకోణం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో రూ.10కోట్ల నక్కలవాగు పనులకి ఇరిగేషన్ శాఖ అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లకి ఈ నెల 5 వరకూ గడువు ఇచ్చారు. టెండర్ల ప్రక్రియ పూర్తి కాకుండానే మంత్రి కాకాణి అనుచరులు పనులు ప్రారంభించారు. 20 రోజులుగా 7 భారీ యంత్రాలతో పనులు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించి కూడా పట్టనట్టే వ్యవహరిస్తున్నారు.

నక్కలవాగు వద్ద అనధికారికంగా సాగుతున్న పనులను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేతలు పరిశీలించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి ఇలాకాలో ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు చూస్తూ ఉంటారా? అని ప్రశ్నించారు. మీరేమైనా మంత్రి దగ్గర కూలీలా.. లేదంటే కలెక్టర్ గోళ్లు గిల్లుకుంటున్నారా? అని నిలదీశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే ఇరిగేషన్ పనుల్లో రూ.100కోట్ల అవినీతి జరిగిన విషయాన్ని సోమిరెడ్డి గుర్తు చేశారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-09-01T08:26:20+05:30 IST

News Hub