Kotamreddy : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని నిరశిస్తూ పోరాటం కొనసాగించాలని కోటంరెడ్డి నిర్ణయం

ABN , First Publish Date - 2023-09-13T11:01:08+05:30 IST

నెల్లూరు జిల్లాలో పోలీసు అరాచకం కొనసాగుతోంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారంటూ హడావుడి జరిగింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని నిరశిస్తూ పోరాటం కొనసాగించాలని కోటంరెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

Kotamreddy : చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని నిరశిస్తూ పోరాటం కొనసాగించాలని కోటంరెడ్డి నిర్ణయం

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో పోలీసు అరాచకం కొనసాగుతోంది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారంటూ హడావుడి జరిగింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని నిరశిస్తూ పోరాటం కొనసాగించాలని కోటంరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే కోటంరెడ్డి తన కార్యాలయంలో నిరాహారదీక్ష చేపట్టారు .కోటంరెడ్డిని ఇటీవల వరుసగా మూడు రోజుల పాటు పోలీసులు గృహ నిర్భంధం చేశారు. నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ఇంట్లోకి ఎలా వస్తారని కోటంరెడ్డి ప్రశ్నించారు. మహిళా ఏఎస్ఐతో కోటంరెడ్డిపై ఫిర్యాదు చేయించి మరీ పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-09-13T11:01:08+05:30 IST