Kotamreddy Sridhar Reddy: జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి
ABN , First Publish Date - 2023-01-02T18:22:10+05:30 IST
సీఎం జగన్ (CM Jagan)ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) కలిశారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా...
అమరావతి: సీఎం జగన్ (CM Jagan)ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy Sridhar Reddy) కలిశారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటంరెడ్డి విమర్శలు చేశారు. నెల్లూరు (Nellore) రూరల్‌లో 2,700 పెన్షన్లు తొలగించడంపై కోటంరెడ్డి అభ్యంతరం తెలిపారు. సీఎం ఆదేశించినా దర్గా అభివృద్ధికి నిధులు ఇవ్వలేదంటూ.. ఐఏఎస్ అధికారి రావత్‌పైనా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే జగన్‌ను కోటంరెడ్డి కలినట్లు తెలుస్తోంది. కోటంరెడ్డితో పాటు వైసీపీ (YCP) రీజినల్ కో-ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) కూడా జగన్‌ను కలిశారు.
మరో 15 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోటంరెడ్డి ప్రభుత్వం విమర్శలు గుప్పిచడం కలకలం రేపింది. తన నియోజకవర్గంలో మురుగునీటి కాలువ సమస్యపై ఆయన చేపట్టిన నిరసన కార్యక్రమం ఒక్కసారిగా యావత్తు రాష్ట్రాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఆయన స్వయంగా కాలువలోకి దిగి నిరసన తెలుపడంతో రాష్ట్రం దృష్టంతా అటు మళ్లింది. తన నియోజకవర్గంలో పెన్షన్లు కోతపై బాహాటంగానే విరుచుకుపడ్డారు.