MLA Kotam Reddy: అక్రమ మైనింగ్‌పై ఎందుకు స్పందించడం లేదు
ABN , Publish Date - Dec 18 , 2023 | 01:38 PM
నెల్లూరు: జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎందుకు స్పందించడం లేదని జాయింట్ కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేతలు అబ్దుల్ అజీజ్, శ్రీనివాసులు రెడ్డి తదితరులు నిలదీశారు.
నెల్లూరు: జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎందుకు స్పందించడం లేదని జాయింట్ కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేతలు అబ్దుల్ అజీజ్, శ్రీనివాసులు రెడ్డి తదితరులు నిలదీశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధారాలు చూపుతూ మూడు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన కాలనీ సమీపంలో బ్లాస్టింగ్ చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు.
జిల్లాలో అధికార పార్టీ నేతలు కొన్నాళ్లుగా గ్రావెల్, ఇసుక, క్వార్టజ్ దోచేస్తున్నారని, మాజీ మంత్రి సోమిరెడ్డి నిరవధిక దీక్ష చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 భారీ యంత్రాలు, అధిక సంఖ్యలో టిప్పర్లు అక్కడే ఉన్నాయని, పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారని, అన్నీ తెలిసినా అధికారులు స్పందించడం లేదన్నారు. చర్యలు తీసుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు.