MLA Kotam Reddy: సజ్జలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

ABN , First Publish Date - 2023-10-02T12:28:07+05:30 IST

మన దేశంలోనే కాదు. ప్రపంచంలోనే కమ్యుూనిస్టు పార్టీలను కొనే మొనగాడు ఇప్పటి వరకు పుట్టలేదు. ఇకపై పుట్టబోడు. కమ్యుూనిస్టు పార్టీల చరిత్ర మీకు తెలుసా?, ప్రపంచంలోని అనేక దేశాల్లో సామాజిక, ప్రజా ఉద్యమాలకు, అణగారిన వర్గాల హక్కులు, మతసామరస్యం, స్వాతంత్రం కోసం కమ్యుూనిస్టు పార్టీలు చేసిన

MLA Kotam Reddy: సజ్జలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

నెల్లూరు: ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మన దేశంలోనే కాదు. ప్రపంచంలోనే కమ్యుూనిస్టు పార్టీలను కొనే మొనగాడు ఇప్పటి వరకు పుట్టలేదు. ఇకపై పుట్టబోడు. కమ్యుూనిస్టు పార్టీల చరిత్ర మీకు తెలుసా?, ప్రపంచంలోని అనేక దేశాల్లో సామాజిక, ప్రజా ఉద్యమాలకు, అణగారిన వర్గాల హక్కులు, మతసామరస్యం, స్వాతంత్రం కోసం కమ్యుూనిస్టు పార్టీలు చేసిన పోరాటాలను తెలుసుకోండి. కమ్యుూనిస్టు పార్టీలను విధానపరంగా విమర్శలు చేయొచ్చు. ఏపీలో చంద్రబాబు (Chandrababu Arrest) అక్రమ అరెస్టుని ఖండించి పోరాటాల్లో పాల్గొంటే తప్పేంటి?, ఈ దేశంలోని చాలా పార్టీలు చంద్రబాబు అరెస్టును ఖండించాయి. ప్రపంచంలోని తెలుగువారంతా వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నారు. సజ్జల వ్యాఖ్యలను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు‌. సజ్జల వెంటనే కమ్యుూనిస్టులకు బేషరుతుగా క్షమాపణ చెప్పాలి.’’ అని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-10-02T12:28:07+05:30 IST