Somireddy: ధైర్యం ఉంటే మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి...
ABN , First Publish Date - 2023-11-06T12:34:40+05:30 IST
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బృందం సోమవారం పర్యటిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి రాష్ట్ర టీడీపీ వ్యవసాయ కమిటీ బృందం నిర్ణయించింది.
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం బృందం సోమవారం పర్యటిస్తోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి రాష్ట్ర టీడీపీ వ్యవసాయ కమిటీ బృందం నిర్ణయించింది. ఈ సందర్బంగా సోమవారం అనంతపురంలో టీడీపీ నేత (TDP Leader) సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohhan Reddy) మీడియాతో మాట్లాడుతూ.. నష్టపోయిన పంటపొలాలను పరిశీలించేందుకు టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ (TDP Agriculture Steering Committee) ఏర్పాటు చేసిందన్నారు. చంద్రబాబు (Chandrababu) హయాంలో రూ. 2,300 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ (Input Subsidy Insurance) ఇచ్చామన్నారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) మాత్రం 111. 43 లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ అందించిందని విమర్శించారు. మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే క్షేత్రస్థాయిలో పర్యటించాలని సోమిరెడ్డి సవాల్ చేశారు.
470 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించాల్సి ఉండగా 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా జగన్ ప్రభుత్వం ప్రకటించి చేతులు దులుపుకుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వేరుశనగకు ఎకరాకు రూ. 25 వేలు, మిరపకు 50 వేల రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరువు బారిన పడిన రైతులకు ఏం ఏం చేశారో రైతులకు చెబితే మంత్రుల మొఖాన ఉమ్మేస్తారన్నారు. కరువు బారిన పడిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్సూరెన్స్ కడతామని చెప్పి రైతుల కొంపలు ముంచేశారని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.