Nara Lokesh: యువతతో లోకేశ్ ముఖాముఖి.. వైసీపీ పాలనను ఎండగట్టిన యువనేత

ABN , First Publish Date - 2023-06-15T16:02:52+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా బొమ్మవరం క్యాంపు సైట్‌లో హెలో లోకేశ్ పేరుతో యువతతో యువనేత ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలో టాప్ టెన్ కంపెనీలని తీసుకువచ్చామని చెప్పారు.

Nara Lokesh: యువతతో లోకేశ్ ముఖాముఖి.. వైసీపీ పాలనను ఎండగట్టిన యువనేత

నెల్లూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం (Nara lokesh YuvaGalam Padayatra) పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా బొమ్మవరం క్యాంపు సైట్‌లో హెలో లోకేశ్ పేరుతో యువతతో యువనేత ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... టీడీపీ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. ప్రపంచంలో టాప్ టెన్ కంపెనీలని తీసుకువచ్చామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ప్రభుత్వ, ప్రైయివేటు ఉద్యోగాలు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికి ఇగా స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలని చూశామని.. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ వ్యవస్థని మొత్తం చంపేసిందని మండిపడ్డారు. విదేశీ విద్యా పథకం మళ్లీ అమలు చేస్తామని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీవీలు, సెల్ ఫోన్‌లు తయారయ్యేవని.. ఇప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా, దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని వ్యాఖ్యలు చేశారు. గంజాయి వ్యాపారం మొత్తం వైసీపీ నేతలే నడిపిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని... గంజాయి అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి లోపలేస్తామని హెచ్చరించారు.

గంజాయి మాఫియాలకు కేరాఫ్ తాడేపల్లి కొంప...

మేకపాటి గౌతమ్ మూడేళ్లు పరిశ్రమలు తీసుకురావాలని ప్రయత్నించారని... ఆయనికి కూడా పరిశ్రమలు తెచ్చే అవకాశం లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో విధ్వంసం, తుగ్లక్ సీఎం అంటూ పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహస్తామని.. అన్ని విధాల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. యుపీపీఎస్ మాదిరిగా ఏపీపీఎస్‌ను బలోపేతం చేస్తాం‌మన్నారు. పోలీసు శాఖని బలోపేతం చేస్తామని తెలిపారు. ప్రిజనర్... విజనర్‌కు చాలా తేడా ఉందన్నారు. పదహారు నెలలు జైలుశిక్ష అనుభవించిన వ్యక్తికి, విజన్‌తో పాలన సాగించే నాయకుడికి అదే తేడా అని చెప్పుకొచ్చారు. ఇసుక, మద్యం, గ్రావెల్, గంజాయి మాఫియాలు...కేరాఫ్.. తాడేపల్లి కొంప అంటూ విరుచుకుపడ్డారు. జిల్లాల విభజన పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జరగకూడదని.. అవగాహాన లేని సీఎం చేసిన జిల్లాల విభజన వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయన్నారు. కేజీ టూ పీజీ వరకు రీ వ్యాంప్ చేయాలన్నారు. యూనివర్శిటీలు, కాలేజీలు రావాలని.. ఆ బాధ్యత తాము తీసుకుంటామని చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలోనే తానేదో డబ్బులు తీసుకున్నాని... కేసులు నమోదు చేయాలని... అరెస్టులు చేయాలని సీఎం జగన్ చూశారని ఆయన మండిపడ్డారు.

సైకోనే కాదు... సైకో ఫ్యాక్షనిస్టు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 1986లో సోమశిల నిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలని జీవో విడుదలైందని... పెండింగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే‌ మూడు నెలల్లో ఒక్కొక్క నిరుద్యోగికి మూడువేలు చొప్పున భృతి ఇస్తామన్నారు. పులివెందులలో ఓ దళితుడిని వైసీపీ నేతలు హత్య చేశారన్నారు. నాగమ్మ అనే మహిళ కుటుంబాన్ని మాయం చేశారని.. అది అడగటానికి వెళితే, ఎస్సీ నేతలపైనే అట్రాసిటీ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైబర్ గ్రిడ్ ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. మెగా బైట్స్ కాదు... జిగా బైట్స్ స్పీడ్ తమ లక్ష్యమన్నారు. సీఎం జగన్ తొమ్మిదిసార్లు కరెంట్ ఛార్జీలు పెంచి, వచ్చే ఎన్నికల్లో తగ్గిస్తామంటున్నారని వ్యాఖ్యలు చేశారు. జగన్ అనే వ్యక్తి ట్రూ ఫ్యాక్సనిస్డు అని.. సైకోనే కాదు... సైకో ఫ్యాక్షనిస్టు అని అన్నారు. ప్రజలందరూ బాధపడుతున్నారని.. చివరికి వైసీపీ నేతలు కూడా, ఈ పార్టీకి ఎందుకు పనిచేశామా అని బాధపడుతున్నారని లోకేశ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-15T16:02:52+05:30 IST