Lokesh YuvaGalam: 1753.4 కిలోమీటర్లు... ఈరోజు లోకేష్ పాదయాత్ర ఏ ప్రాంతంలో అంటే...

ABN , First Publish Date - 2023-06-24T09:52:05+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. ఎక్కడికక్కడ ప్రజలు పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు. వందల సంఖ్యలో ప్రజలు లోకేష్ వెంట పాదయాత్ర చేస్తూ తమ సమస్యలను చెప్పుకొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడాల లేకుండా యువనేత అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో అనేక సంఘాల ప్రతినిధులు, మహిళలు, రైతులు, యువత ఇలా ఎంతో మందితో ముఖాముఖిలు, చర్చలు నిర్వహిస్తున్నారు.

Lokesh YuvaGalam: 1753.4 కిలోమీటర్లు... ఈరోజు లోకేష్ పాదయాత్ర ఏ ప్రాంతంలో అంటే...

నెల్లూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader NaraLokesh) యువగళం పాదయాత్ర(YuvaGalam Padayatra) విజయవంతంగా దూసుకెళ్తోంది. ఎక్కడికక్కడ ప్రజలు పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు. వందల సంఖ్యలో ప్రజలు లోకేష్ వెంట పాదయాత్ర చేస్తూ తమ సమస్యలను చెప్పుకొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడాల లేకుండా యువనేత అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో అనేక సంఘాల ప్రతినిధులు, మహిళలు, రైతులు, యువత ఇలా ఎంతో మందితో ముఖాముఖిలు, చర్చలు నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు వింటూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు తీరుస్తామంటూ హామీ ఇస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రవేశిస్తున్న లోకేష్‌కు మహిళలు హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. జనవరి 27న పాదయాత్ర మొదలవగా ఇప్పటి వరకు 1753.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి అయ్యింది. ఈరోజు (శనివారం) 136వ రోజు వజ్జావారిపాళెం, పెద్దపరియ క్రాస్ రోడ్డు, తిరుమలపూడి, మాచవరం, ముమ్మాయపాళెం, కోనేటిరాజుపాళెం, మనవలి రోడ్డు మీదుగా మేనకూరు వరకు యాత్ర కొనసానుంది. పాదయాత్రలో భాగంగా వజ్జావారిపాలెం క్యాంపు సైటులో చర్చి ఫాదర్లతో యువనేత సమావేశంకానున్నారు. ఈరోజు రాత్రి మేనకూరు శివార్లలో లోకేష్ (Nara lokesh) రాత్రి బస చేయనున్నారు.

lokesh-mama.jpg

నిన్నటి పాదయాత్ర ఇలా...

నిన్న 135వ రోజు పాదయాత్ర నిడిగల్లు శివారు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. ఇనుగుంట వద్ద సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాద‌యాత్ర‌కి ప్ర‌జ‌లు ఘనస్వాగతం పలికారు. లోకేష్ పాదయాత్రకు నంద‌మూరి రామ‌కృష్ణ సంఘీభావం తెలుసుతూ యువనేతతో కలిసి నడిచారు. జయంపు గ్రామంలో బ్రాహ్మణులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వారి స‌మ‌స్య‌లను అడిగి తెలుసుకున్నారు. పిగిలాం, కామకూరు, హస్తకవేరి, జయంపు మీదుగా ఇనుగుంట వ‌ర‌కూ లోకేష్ పాదయాత్ర సాగింది.

Updated Date - 2023-06-24T09:53:21+05:30 IST