Nimmala Ramanayudu : బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తిని ఎమ్మెల్సీని చేయాలనేది జగన్ తాపత్రయం
ABN , First Publish Date - 2023-03-11T13:57:18+05:30 IST
తూర్పు రాయలసీమ వైసీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై అక్రమ మద్యం తయారీ, విక్రయం కేసులున్నాయని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
అమరావతి : తూర్పు రాయలసీమ వైసీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డిపై అక్రమ మద్యం తయారీ, విక్రయం కేసులున్నాయని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తిని ఎమ్మెల్సీని చేసి, పెద్దల సభకు పంపాలని సీఎం జగన్ తాపత్రయపడుతున్నారన్నారు. తాను బెయిల్‌పై ఉండి ముఖ్యమంత్రి కాగా లేనిది.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే తప్పేంటనే జగన్ అతన్ని ఎంపిక చేశారన్నారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి కల్తీ మద్యంతో 11 మందిని బలి తీసుకున్నాడన్నారు. అతనిపై ఐపీసీ 420, 487, 120 (బీ) సెక్షన్లు నమోదయ్యాయని నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎక్సైజ్ యాక్ట్ 34, 37పై కేసులు నమోదయ్యాయన్నారు. కల్తీ మద్యం తయారీ, విక్రయదారులు, ఎర్రచందనం స్మగ్లర్లు తప్ప మండలికి పంపడానికి జగన్‌కు మేథావులు, విజ్ఞులు దొరకలేదా? అని ప్రశ్నించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి లాంటి దొంగల్ని కాకుండా, కంచర్ల శ్రీకాంత్ లాంటి విజ్ఞుల్ని ఎన్నుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తున్నామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.