YCP: ఆ ఇళ్లను డిసెంబర్ నాటికి అందిస్తాం: మంత్రి ఆదిములపు
ABN , First Publish Date - 2023-04-08T18:49:58+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా పేజ్ 2, పేజ్ 3 టిడ్కో ఇళ్లను అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు డిసెంబర్ నాటికి అందిస్తామని మంత్రి ఆదిములపు సురేష్ (Adimulapu Sures) వెల్లడించారు.
ప్రకాశం: రాష్ట్ర వ్యాప్తంగా పేజ్ 2, పేజ్ 3 టిడ్కో ఇళ్లను అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు డిసెంబర్ నాటికి అందిస్తామని మంత్రి ఆదిములపు సురేష్ (Adimulapu Sures) వెల్లడించారు. నెల్లూరులో చంద్రబాబు (Chandrababu) సెల్ఫీ దిగిన ఇళ్లు వైసీపీ (YCP) ప్రభుత్వం వచ్చాక పూర్తిచేశామని అన్నారు. టిడ్కో ఇళ్లపై బహిరంగ చర్చకు తాము సిద్ధమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల 30వేల టిడ్కో ఇళ్లను డిసెంబర్ నాటికి లబ్ధిదారులకు అందిస్తామని ఆయన తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లను అసంపూర్తిగా మధ్యలోనే వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి, కొడుకులు టిడ్కో ఇళ్ళ సెల్ఫీలు దిగి అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. తాజ్ మహల్, ఛార్‌మినార్ ముందు చంద్రబాబు, లోకేష్ (Lokesh)లు సెల్ఫీలు తీసుకుని తామే కట్టామని చెప్పుకుంటారని విమర్శించారు. పేదల సంక్షేమం కోసం పోరాడుతోంది ఒక జగన్‌నే అన్నారు. రూపాయికే టిడ్కో ఇళ్లను పేదలకి అందిస్తున్న ఘనత సీఎం జగన్ (CM Jagan)దే అని అన్నారు. టిడ్కో ఇళ్ళపై టీడీపీ 18,00 కోట్ల భారంని వైసీపీ ప్రభుత్వం భరించిందన్నారు.