Balineni: టీడీపీ సింగిల్‌గా పోటీ చేయొచ్చు కదా?
ABN , First Publish Date - 2023-10-14T12:50:47+05:30 IST
టీడీపీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ... సింగిల్‌గా పోటీ చేయొచ్చు కదా అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
ప్రకాశం: టీడీపీ (TDP) ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ... సింగిల్‌గా పోటీ చేయొచ్చు కదా అని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (Former Minister Balineni Srinivas Reddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలు కలిసి వైసీపీపై (YCP) పోటీ చేస్తున్నాయన్నారు. ఒంగోలు, దర్శి, గిద్దలూరులో జనసేన (Janasena) ప్రభావం ఉంటుందని.. అయినా ఆ నియోజక వర్గాల్లో కూడా తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) వెయిట్ తగ్గారని టీడీపీ నాయకులు చెబుతున్నారని.. డాక్టర్లు వెయిట్ తగ్గలేదని చెబుతున్నారన్నారు. చంద్రబాబుకు సమస్య ఉంటే ఖచ్చితంగా హాస్పటల్‌కు తీసుకువెళ్లి చికిత్స చేస్తారని.. కావాలని జైలులో ఉంచి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఎవరూ చెయ్యరని చెప్పుకొచ్చారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని తన ఉద్దేశమన్నారు. వైసీపీ కార్యకర్తలపై నెపం వేసి సస్పెండ్ చేస్తే వారికి అండగా ఉంటానన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవాలని చెప్పానని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.