Collector Dinesh Kumar: ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు
ABN , First Publish Date - 2023-11-03T19:22:20+05:30 IST
ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ ( Collector Dinesh Kumar ) తెలిపారు.
ప్రకాశం: ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్ కేసులో సిట్ దర్యాప్తు జరుగుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ ( Collector Dinesh Kumar ) తెలిపారు. శుక్రవారం నాడు కలెక్టరేట్‌లో మీడియా మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలులో జరుగుతున్న భూకబ్జాలపై మీడియాకు తెలిపారు. 572 ఫేక్ డాక్యుమెంట్స్, 60 స్టాంప్స్, 1200 జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ పత్రాలు పోలీసులు సీజ్ చేశారు. నకిలీ డాక్యుమెంట్స్ కేసులో 38 మందిని అరెస్టు చేశారు. కనిగిరి, మార్కాపురంలో కూడా భూకబ్జాలపై సిట్ దర్యాప్తు జరుగుతుంది. 10-12 సంవత్సరాల నుంచి భూకబ్జాలు జరుగుతున్నట్టు విచారణలో తేలింది. ఖాళీ భూములు గుర్తించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే సిట్ అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం’’ అని కలెక్టర్ దినేష్ కుమార్ పేర్కొన్నారు.