TDP MLA: ఎమ్మెల్యే స్వామి అరెస్ట్... తోపులాటలో చిరిగిన టీడీపీ నేత చొక్కా.. కొండేపిలో హైటెన్షన్

ABN , First Publish Date - 2023-06-05T10:04:41+05:30 IST

టంగుటూరు బయలు దేరిన ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

TDP MLA: ఎమ్మెల్యే స్వామి అరెస్ట్... తోపులాటలో చిరిగిన టీడీపీ నేత చొక్కా.. కొండేపిలో హైటెన్షన్

ప్రకాశం: టంగుటూరు బయలు దేరిన ఎమ్మెల్యే వీరాంజనేయ స్వామిని (TDP MLA Veeranjneya swamy) పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండేపి నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్ బాబు (YCP Leader Ashok babu) తీరుని నిరశిస్తూ నాయుడుపాలెం నుంచి ఎమ్మెల్యే స్వామి, టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీగా టంగుటూరు బయలు దేరారు. అయితే జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టీడీపీ ఎమ్మెల్యే స్వామి చొక్కా చినిగింది. చివరకు ఎమ్మెల్యే స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. టంగుటూరు వెళ్లాల్సిందే అంటూ జాతీయ రహదారిపై వాహనాలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కాగా... జిల్లాలోని కొండేపి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిని ముట్టడికి వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్‌బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ నిధులు ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేశారని వైసీపీ నేత ఆరోపించారు. ఈ క్రమంలో చలో తూర్పునాయుడుపాలెం అంటూ ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి అశోక్ బాబు పిలుపునిచ్చారు. అయితే వైసీపీకి కౌంటర్‌గా చలో టంగుటూరు కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. ఎమ్మెల్యే ఇంటి ముట్టడి నేపథ్యంలో టీడీపీ వ్రేణులు ఇప్పటికే తూర్పు నాయుడుపాలెంలోని ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్దకి చేరుకున్నారు. వైసీపీ ఇన్‌ఛార్జ్ అశోక్ బాబు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అశోక్‌బాబు తీరుని నిరసిస్తూ ఎమ్మెల్యే స్వామి, టీడీపీ శ్రేణులు నాయుడుపాలెం నుంచి భారీ ర్యాలీగా టంగుటూరుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - 2023-06-05T10:29:23+05:30 IST