Purandeswari: ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నా.. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం
ABN , First Publish Date - 2023-08-01T20:04:18+05:30 IST
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు (jagan govt) తీరుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు (jagan govt) తీరుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రజలకు జవాబుగా శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయడం లేదని ఆమె ప్రశ్నించారు.
"జగన్ ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు మల్ల గుల్లాలు పడుతుంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 77వేల 21 కోట్ల అప్పులు అని తెలుస్తుంది. గతంలో నేను ఏపీ అప్పులు 10 లక్షల కోట్లు అంటే.. ఏడు కోట్లు జగన్ ప్రభుత్వం చేసినట్లు చెప్పారు. ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలో మాత్రమే లక్షా 77వేల కోట్లు అని నిర్మలా సీతారామన్ చెప్పారు. మరి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి, మద్యం ఆదాయం చూపి చేసిన అప్పులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కలిపి 10 లక్షల కోట్లు అప్పు ఉందన్న మాటకు ఇప్పటికి కట్టుబడి ఉన్నాను." అని ఆమె అన్నారు.
"వీటిని వివరిస్తూ నిర్మలా సీతారామన్ కు రాతపూర్వకంగా ఇచ్చాను. కోవిడ్ వల్ల నలభై వేల కోట్లు అప్పు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఇతర వనరులు ద్వారా అదనంగా అప్పులు చేశారు. రాష్ట్రానికి ఎటువంటి పరిశ్రమలు రాలేదు. పదిహేను లక్షల కోట్ల ఆదాయం ఆర్.బి.ఐ కి ఎలా చూపించారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ విధంగా చాలా అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయడం లేదు." అని పురందేశ్వరి మండిపడ్డారు.