Raghurama Krishnaraju : ఉదయాన్నే ఈరోజు ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది..!

ABN , First Publish Date - 2023-07-31T14:01:45+05:30 IST

ఉదయాన్నే ఈ రోజు ఒక దుర్వార్త వినాల్సి వచ్చిందని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. విశాఖలో వరలక్ష్మి అనే మహిళలను వలంటీర్ హత్య చేశాడని.. ఎలాంటి బాధ్యతలు లేని వారిని ఊరు మీదకు.. ఇంటి మీదకు జగన్ వదిలేశారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు.

Raghurama Krishnaraju : ఉదయాన్నే ఈరోజు ఒక దుర్వార్త వినాల్సి వచ్చింది..!

ఢిల్లీ : ఉదయాన్నే ఈ రోజు ఒక దుర్వార్త వినాల్సి వచ్చిందని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. విశాఖలో వరలక్ష్మి అనే మహిళలను వలంటీర్ హత్య చేశాడని.. ఎలాంటి బాధ్యతలు లేని వారిని ఊరు మీదకు.. ఇంటి మీదకు జగన్ వదిలేశారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామ నేడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వలంటీర్ చేస్తున్న పని ఏంటి ? పింఛన్ వార్డు మెంబర్ కూడా ఇవ్వొచ్చు లేదంటే అకౌంట్‌లో వేయవచ్చు. ఒక ఇంటి నంబర్ పై 500 వందల దొంగ ఓట్లు నమోదు చేశారు. అసలు దొంగ ఓట్లు ఉన్నవారి పేరు మీద ఉన్న పించన్ ఎవరి ఖాతాలోకి వెళ్తుంది? డేటా చౌర్యం తప్ప చేస్తుంది ఏమి లేదు. మహిళల ఫోటోలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలంటే ఎవరెవరికి కనెక్షన్లు ఉన్నయనే వివరాలు సేకరిస్తారా ? ఏంటీ ఈ దరిద్రపు ఆలోచన? జనసేన అధినేత పవన్ కల్యాణ్ గట్టిగా వలంటరీ వ్యవస్థను ప్రశ్నించారు. సిగ్గు లేకుండా ప్రభుత్వమే పవన్ కల్యాణ్ పై పరువునష్టం కేసు వేసింది. ఈ హత్యకు బాధ్యుడు ఎవరంటే.. A 1జగన్మోహన్ రెడ్డి, ఎంపీలు కూడా వస్తారు. మేమందరం ఈ మర్డర్ లో భాగస్వాములమే. ప్రభుత్వమే వరలక్ష్మి హత్యకు బాధ్యత వహించాలి. పంచాయితీ వ్యవస్థ ఉండగా, వలంటిరీ వ్యవస్థ ఎందుకు? తీసేయండి. పార్టీల నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి వలంటరీ వ్యవస్థ వద్దు. ఎటువంటి బాధ్యత లేని వలంటరీ వ్యవస్థకు తీసుకొచ్చిన వారిని దొంగ అనాలా? వలంటరీ వ్యవస్థను ఒక క్యాన్సర్ గడ్డ లాగా జగన్ ప్రవేశ పెట్టారు’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-07-31T14:02:45+05:30 IST