TDP Vs YCP: టీడీపీ నేతల న్యాయపోరాటానికి అధికారపార్టీ అడ్డంకులు
ABN , First Publish Date - 2023-08-21T14:20:34+05:30 IST
పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై నమోదైన కేసులపై తెలుగుదేశం న్యాయ పోరాటానికి దిగింది.
అమరావతి: పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై నమోదైన కేసులపై తెలుగుదేశం న్యాయ పోరాటానికి దిగింది. అయితే టీడీపీ నేతలు చేస్తున్న న్యాయపోరాటానికి అడ్డంకులు సృష్టించే అధికార వైసీపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. పోలీసుల సహకారంతో టీడీపీ నేతలు చేస్తున్న న్యాయపోరాటానికి అధికార పార్టీ ఆటంకాలు కలిగిస్తోంది. తనపై పెట్టిన అక్రమ కేసును కొట్టివేయాలంటూ టీడీపీ నేత గంటా నరహరి హైకోర్టును (AP High Court) ఆశ్రయించారు. గంటా నరహరి పిటిషన్‌పై హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. గంటా నరహరి కేసులో తదుపరి ఉత్తర్వులు, వచ్చే వరకు ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అలాగే సంఘటన స్థలంలో లేకపోయినా తనపై అక్రమ కేసు పెట్టారంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆర్ శ్రీనివాస్ రెడ్డి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. ఆయనపై ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించింది. మరోవైపు తమపై నమోదు చేసిన కేసులపై నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారు. పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారంటూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తమ నేతలకు బయలు రాకుండా పోలీసులు ఆటంకాలు కలిగిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.