SomuVeerraju: పొత్తులపై సోమువీర్రాజు కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-02-02T19:11:29+05:30 IST
పొత్తులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu Veerraju) కీలక వ్యాఖ్యలు చేశారు.
అల్లూరి: పొత్తులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు సోమువీర్రాజు (Somu Veerraju) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో టీడీపీ (TDP), వైసీపీ (YCP)తో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని సోమువీర్రాజు వెల్లడించారు. జనంతో వస్తే జనసేన (JANASENA)తోనే వచ్చే ఎన్నికల్లో తమ పొత్తు ఉంటుందని సోమువీర్రాజు స్పష్టంగా చెప్పారు. కుటుంబ పార్టీలతో ఎట్టిపరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని సోమువీర్రాజు పేర్కొన్నారు.
ఇటీవల బీజేపీ, జనసేన తీరు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసి పోగా.. సంయుక్తంగా ముందుకు వెళ్తామని ఆ పార్టీ నేతలు అప్పట్లో ప్రకటించారు. అయితే ఇటీవల రెండు పార్టీల తీరు ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా ఉంది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందా లేదా అన్న చర్చ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో పొత్తులు ఉంటాయని ఒకసారి.. బీజేపీతో కలిసి పనిచేస్తామని మరోసారి చెబుతున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో జనసేన అంశం ప్రస్తావనకు రాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాత్రం పవన్ తమతోనే ఉన్నారని అంటున్నారు.