Share News

Atchannaidu: ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి..

ABN , Publish Date - Dec 27 , 2023 | 08:38 AM

శ్రీకాకుళం: తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు సేవ చేయడం.. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారని.. కానీ..

Atchannaidu: ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి..

శ్రీకాకుళం: తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ప్రజలకు సేవ చేయడం.. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారని.. కానీ ఏపీ రాష్ట్రానికి 2019లో దురదృష్టం ఒక శని పట్టిందని.. దాని పేరే జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి పదవిని ప్రజల కోసం, ప్రజా సేవ గురించి ఉపయోగిస్తారు.. కానీ సీఎం జగన్ తన వ్యాపారం కోసం ఉపయోగించుకుంటున్నారని, పంచభూతాలను దోచుకున్నారని దుయ్యబట్టారు.

రేపో.. ఎల్లుండో పీల్చే గాలికి కూడా డబ్బులు వసూలు చేస్తారని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రచారం పిచ్చి బాగా పట్టుకుందని, అన్నింట్లో ఆయన ఫోటో వేసుకుంటున్నారని విమర్శించారు. మద్యపానం నిషేధం అని చెప్పిన జగన్.. ఈరోజు కల్తీ మద్యంతో తాళిబొట్టులతో ఆటలాడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలనే కుట్ర చేశారని... వైసీపీ పార్టీలా గాలికి పుట్టిన పార్టీ కాదని, టీడీపీ పేదల హృదయాలనుంచి పుట్టిన పార్టీ అని అన్నారు. ఇక జగన్ పని అయిపోయిందని, మరో 90 రోజుల్లో ఇంటికి వెళ్లి పోతారని జోష్యం చెప్పారు. ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకుపంపుతారని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - Dec 27 , 2023 | 08:38 AM