Atchannaidu: వివేకా హత్య కేసులో సీఎం జగన్‌ను విచారించాలి

ABN , First Publish Date - 2023-05-17T14:16:14+05:30 IST

అమరావతి: వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన రోజు తెల్లవారుజామున ముఖ్యమంత్రితో సమావేశంలో ఉన్న అజేయకల్లంతో "మా బాబాయికి గుండెపోటు వచ్చి చనిపోయాడు."

Atchannaidu: వివేకా హత్య కేసులో సీఎం జగన్‌ను విచారించాలి

అమరావతి: వైఎస్ వివేక హత్య కేసు (YS Viveka Murder Case)కు సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ట్విట్టర్ (Twitter) వేదికగా సీఎం జగన్‌ (CM Jagan)పై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన రోజు తెల్లవారుజామున ముఖ్యమంత్రితో సమావేశంలో ఉన్న అజేయ్ కల్లం (Ajay Kallam)తో "మా బాబాయికి గుండెపోటు వచ్చి చనిపోయాడు." అని చెప్పారని.. అది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని ప్రజలకు తెలిసిపోయిన మరుక్షణం మాట మార్చేశారు.. హత్య ఏ విధంగా జరిగిందో తానే స్వయంగా చూసినట్లు ఒక్కొక్క విషయాన్నీ బాగా వివరించారు.. ఇప్పుడు సీబీఐ (CBI) జగన్‌ను కూడా పిలిచి బాబాయి వివేక హత్య ఏ విధంగా జరిగిందనేది అతనికి ఎలా తెలుసు?.. హత్య జరిగిన క్రమాన్ని అంత చక్కగా పూస గుచ్చినట్లు ఎలా వివరించారు?.. అని జగన్‌ను విచారించాలన్నారు.. అప్పుడే అంతఃపుర రహస్యాలు అన్నీ బయటకు వస్తాయి... వివేకా కుటుంబానికి న్యాయం జరుగుతుంది..’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2023-05-17T17:14:51+05:30 IST