Dharmana Prasadarao: పవన్‌పై మంత్రి ధర్మాన పరోక్ష విమర్శలు
ABN , First Publish Date - 2023-07-11T16:21:16+05:30 IST
జనసేనాని పవన్ కల్యాణ్‌పై మంత్రి ధర్మాన ప్రసాదరావు పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
శ్రీకాకుళం: జనసేనాని పవన్ కల్యాణ్‌పై (Janasena Pawan Kalyan) మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasadrao) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి అనక , పగలనక వాలంటీర్లుగా పని చేసిన వారిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ‘‘బాధ్యత లేక వారు మాట్లాడుతున్నారు. ఎవరో బ్రోకర్ వెధవ అన్నాడని, పలికి మాలినోడి మాటల్ని పట్టించుకోవద్దు. సమాజంలో వేస్ట్ టిక్కెట్లు , చీడ పురుగులు తిరుగుతూ ఉంటారు. మంచి పని చేసేవారికి పోరంభోకులు తగులుతుంటారు. నిన్నో పెద్ద మనిషి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వారికేటి తెలిదు. నాలుగు గోడల మధ్య సినిమాలు తీసేవాడు గొప్పగా ఫీలవుతూ ఉంటారు. యాక్షన్‌లు చేయడం గొప్పకాదు.. నిజ జీవితం గొప్ప. ఓ వాలంటీర్లు విమర్శిస్తే ఆయన స్థాయి ఏంటో మనకి అర్థం అవుతుంది. అలాంటి వారిని విమర్శించడం నా స్థాయికి తగదు’’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు చేశారు.