Share News

Chandrababu Bail: చంద్రబాబుకు బెయిల్ మంజూరు

ABN , First Publish Date - 2023-10-31T10:45:25+05:30 IST

ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఎట్టకేలకు దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Chandrababu Bail: చంద్రబాబుకు బెయిల్ మంజూరు

అమరావతి: ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (TDP Chief Chandrababu Naidu) ఊరట లభించింది. ఎట్టకేలకు దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో (Skill Development Case) చంద్రబాబుకు హైకోర్టు (AP High Court) బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ కోరడంతో ఏపీ హైకోర్ట్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు నవంబర్ 24 వరకు అనుమతి ఇచ్చింది.


చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో టీడీపీ (TDP) శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అధికారులు (CID Officers) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 10వ తేదీ ఉదయం ఏసీబీ కోర్టులో (ACB Court) పోలీసులు హాజరుపరిచారు. అనంతరం 10 అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు (Rajahmundry Central Jail) బాబును తరలించారు. గత 53 రోజులుగా టీడీపీ అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు.


నాలుగు గంటలకు విడుదల?

చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నాలుగు గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఎయిర్ పోర్టుకు వరకు చంద్రబాబుకు భారీ ఊరేగింపుతో స్వాగతం పలకాలని టీడీపీ శ్రేణులు నిర్ణయించారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు‌ను తీసుకువెళ్ళి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స చేయించాలని నిర్ణయించారు. ఇప్పటికే చంద్రబాబుకు అధికారులు ఎన్‌ఎస్‌జీల భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

రాజమండ్రికి లోకేష్, బ్రహ్మణి

మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Lokesh), ఆయన సతీమణి బ్రాహ్మణి (Nara Brahmani) రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు‌కు బెయిల్ మంజూరు అయిన విషయాన్ని లోకేష్ వద్ద నాయకులు ప్రస్తావించారు. యుద్ధం ఇప్పుడు ప్రారంభం అయ్యిందని నాయకులు, కార్యకర్తలతో లోకేష్ అన్నారు. RV నగర్లోని క్యాంప్ సైట్ వద్ద నారా లోకేష్, బ్రాహ్మణి, టీడీపీ శ్రేనులు బాణా సంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.

Updated Date - 2023-10-31T11:31:22+05:30 IST