Kotla: దురుద్దేశంతోనే చంద్రబాబు అరెస్ట్.. డోన్‌లో జగన్ సభ అట్టర్ ఫ్లాప్
ABN , First Publish Date - 2023-09-20T20:18:13+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై (YCP government) టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి (Kotla Surya Prakash Reddy) విమర్శలు గుప్పించారు.
కర్నూలు: వైసీపీ ప్రభుత్వంపై (YCP government) టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి (Kotla Surya Prakash Reddy) విమర్శలు గుప్పించారు.
"ప్రభుత్వం నిమజ్జనం అయ్యే సమయం ఆసన్నమైంది. 68 చెరువుల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీలను కోట్ల మీడియాకు చూపించారు. 68 చెరువుల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం 80 శాతం పనులు పూర్తి చేసింది. చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో సానుభూతి పెరగడాన్ని జీర్ణించుకోలేక ముఖ్యమంత్రి 68 చెరువులకు నీరు నింపే కార్యక్రమాన్ని ప్రారంభించారు. డోన్‌లో ముఖ్యమంత్రి సభ అట్టర్ ఫ్లాప్ అయింది. పాలమూరు డిండి ప్రాజెక్టు నుంచి యధేచ్ఛగా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తుంటే ఏపీ ప్రభుత్వం ఎందుకు ప్రశ్నించడం లేదు. ప్రాధాన్యత ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. నేను జైలుకు వెళ్లాను. చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాలనే దురుద్దేశంతోనే చంద్రబాబును జైలుకు పంపారు." అని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.