TDP: జగన్‌రెడ్డి మోసపు లీలలు పేరుతో టీడీపీ వాస్తవ పత్రం విడుదల
ABN , First Publish Date - 2023-06-29T12:11:08+05:30 IST
నవరత్నాల పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు తొమ్మిదైతే... వాటికింద 40 హామీలు ఉన్నాయని తెలుగుదేశం పేర్కొంది.
అమరావతి: ప్రకసించని నవరత్నాలు... జగన్ రెడ్డి మోసపు లీలలు పేరుతో తెలుగుదేశం వాస్తవ పత్రాన్ని విడుదల చేసింది. చెప్పిన మేరకు చేయని హామీలు 39 ఉన్నాయంటూ టీడీపీ (TDP) ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. నవరత్నాల పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) ఇచ్చిన హామీలు తొమ్మిదైతే... వాటికింద 40 హామీలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) మాట్లాడుతూ... మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశామంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన హామీలు 10 శాతం మాత్రమే అని.. తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు. రైతు భరోసా కింద రూ.13500 ఇస్తానని చెప్పి ఇచ్చేది రూ.7500 మాత్రమే అని తెలిపారు. రైతు భరోసా కింద 12 హామీలు ఇస్తే ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో 8 అమలుకాలేదని అన్నారు. ఫించన్ల పెంపు కింద ఇచ్చిన మూడు హామీల్లో రెండు అమలుకాలేదని తెలిపారు. అలాగే అమ్మఒడి కింద ఇచ్చిన రెండు హామీల్లో రెండూ అమలు కాలేదని.. పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన ఐదుు హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. బోధనా రుసుము చెల్లింపు కింద ఇచ్చిన రెండు హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. వైఎస్సార్ జలయజ్ఞం కింద ఇచ్చిన మూడు హామీలకు మూడూ పెండింగ్‌లోనే ఉన్నాయని తెలిపారు. మద్యనిషేధం అంటూ ఇచ్చిన ఒక్క హామీ ఇంతవరకు అమలుకాలేదన్నారు. వైఎస్సార్ ఆసరా, చేయూతల కింద ఇచ్చిన నాలుగు హామీల్లో నాలుగు పెండింగ్‌లోనే ఉన్నాయని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ.. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేనందుకు ప్రభుత్వంపై కేసులు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో దొరికే నాసిరకం మద్యాన్ని అధికారపార్టీ ఎమ్మెల్యేలు తాగగగలరా అటూ ప్రశ్నించారు.
బోండా ఉమా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి పాలనలో 6093 ఖైదీలు కాగలరు కానీ సత్య నాదెండ్లలు కాలేరని వ్యాఖ్యలు చేశారు. ఎవరికో పుట్టిన బిడ్డకు తన పేరు పెట్టుకున్నట్లుగా టిడ్కో ఇళ్లపై ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.