Atchannaidu: 160 సీట్లతో చంద్రబాబు సీఎం అవడం ఖాయం

ABN , First Publish Date - 2023-07-14T13:27:49+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు.

Atchannaidu: 160 సీట్లతో చంద్రబాబు సీఎం అవడం ఖాయం

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా మహిళా నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP C hief Atchannaidu) మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలకు గుర్తింపు రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఐదేళ్లలో తప్పుడు మాటలు చెప్పి అందరినీ నమ్మించారని మండిపడ్డారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా జగన్ నెరవేర్చలేదన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మాట మార్చారని విమర్శించారు. జగన్ బటన్ నొక్కినా డబ్బులు పడటం లేదన్నారు. జగన్ ఫెక్ ముఖ్యమంత్రి అని... అబద్ధాల కోరు అని వ్యాఖ్యలు చేశారు. 50 రోజుల పాటు మాహా శక్తి పథకాలపై ప్రచారం ఉంటుందని... 160 సీట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ వల్లే మహిళలకు ఆస్తిలో వాటా హక్కు వచ్చిందన్నారు. సంక్షేమానికి కాపీ రైట్ తెలుగుదేశం పార్టీది అని అన్నారు. సైకో పాలనలో ఎంతోమంది మహిళలు దగా పడ్డారని విమర్శించారు. మహిళలకు ప్రకటించిన పధకాలతో 7 వేల గ్రామాల్లో ప్రచారం చేస్తామన్నారు. 20 లక్షల మంది మహిళలను కలుసుకునేలా మహా శక్తి రథయాత్ర జరుగుతుందని తెలిపారు. భారతీ రెడ్డి, షర్మిలతో పాటు వైసీపీ మంత్రులకు ఆస్తిలో సమాన హక్కు కలిగింది తెలుగుదేశం పార్టీ వల్లే అని అనిత చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-07-14T13:27:52+05:30 IST