Bonda Uma: పధకం ప్రకారమే యువగళం పాదయాత్రపై దాడులు

ABN , First Publish Date - 2023-09-06T09:50:20+05:30 IST

యువగళం పాదయాత్రపై వైసీపీ దాడులు పధకం ప్రకారమే చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా ఆరోపించారు.

Bonda Uma: పధకం ప్రకారమే యువగళం పాదయాత్రపై దాడులు

అమరావతి: యువగళం పాదయాత్రపై (YuvaGalam Padayatra) వైసీపీ దాడులు పధకం ప్రకారమే చేస్తున్నారని టీడీపీ నేత బోండా ఉమా (TDP Leader Bonda Uma) ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రను ఆపాలని సీఎం జగన్ రెడ్డి పధకం ప్రకారం గొడవలు చేయిస్తున్నారన్నారు. లోకేశ్ పాదయాత్రతో వైసీపీ వెన్నులో వణుకుపుడుతోందని అందుకే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. యువగళం పాదయాత్రపై రాళ్ల దాడి చేసి మళ్ళీ వాలంటర్స్‌పై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. పాదయాత్ర వద్దకు వైసీపీ గూండాలను పోలీసులు ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. లోకేశ్ పాదయాత్రకు తగిన భద్రత కల్పించండి అని డీజీపీకి అనేక లేఖలు రాశామన్నారు. యువగళం పాదయాత్రను అక్రమంగా అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని.. ఎంత వరకు అయినా వెళతామని బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-06T09:50:20+05:30 IST