Devineni Uma: జగన్‌ది చెత్త ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-07-29T16:16:22+05:30 IST
జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మరోసారి విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉంటే కాలువల ద్వారా పొలాలకు తీసుకెళ్లలేని అసమర్థుడు జగన్ అని అన్నారు.
ప్రకాశం: జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు (TDP Leader Devineni Uma maheshwar rao) మరోసారి విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల్లో నీళ్ళు ఉంటే కాలువల ద్వారా పొలాలకు తీసుకెళ్లలేని అసమర్థుడు జగన్ అని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ది చెత్త ప్రభుత్వమని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌కు (CM Jagan reddy) బాధ్యత లేదా అని ప్రశ్నించారు. పట్టిసీమ దండగని బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కోస్తాంధ్రలో ప్రాజెక్టులు పడకేశాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జగనే శని అంటూ వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు తీసుకురాలేక పోతున్నారని.. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో గడ్డి పీకుతున్నారా అంటూ మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులు నీళ్ళలో మునిపోయారని... పశువులు నీళ్ళలో కొట్టుకుపోతున్నాయన్నారు. జగన్ తండ్రి విగ్రహం పోలవరం ప్రాజెక్టు వద్ద ఏం చేశారని పెడతారని ఆయన ప్రశ్నించారు.
నిర్వాసితులను వరద నీటిలో ముంచినందుకు పోలవరం వద్ద వైఎస్ విగ్రహాన్ని పెడతారా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం టీడీపీ ప్రభుత్వంలో పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు చూడటానికి వెళ్తే తనను పోలీసు స్టేషన్‌లో పెట్టారని.. చంద్రబాబు వెళ్తే ప్రొక్లైన్లు అడ్డం పెట్టారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ధనయజ్ఞం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి బాబాయ్ హత్య కేసులో బీజీగా ఉన్నారని యెద్దేవా చేశారు. హత్య కేసులో వాస్తవాలు బయటపడగానే ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారన్నారు. ప్రతి నెలా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల్లో చైతన్యం కోసం చంద్రబాబు ప్రాజెక్టుల వద్ద నిద్ర చేయబోతున్నారన్నారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖకు తాళాలు వేశారన్నారు. ‘‘మా మీద కక్ష ఉంటే మామీద తీర్చుకోండి... పోలవరం నిర్వాసితులకు వేధించొద్దు. పోలవరం బాధితుల ఉసురు జగన్ ప్రభుత్వానికి తగులుతుంది’’ అంటూ దేవినేని ఉమా మహేశ్వర్‌రావు హెచ్చరించారు.