Devineni Uma: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై దేవినేని కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-06-09T16:17:27+05:30 IST

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పోలవరం డ్యామ్‌ను బ్యారేజ్ చేసి గోదావరిలో ముంచారన్నారు. గోదావరి ప్రవాహాన్ని కట్టడి చేసే నిర్మాణం కుంగి పోయిందని తెలిపారు.

Devineni Uma: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై దేవినేని కీలక వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా: పోలవరం ప్రాజెక్ట్ (Polavaram porject) నిర్మాణంపై మాజీ మంత్రి దేవినేని ఉమా (Former Minister Devineni Uma) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) పోలవరం డ్యామ్‌ను బ్యారేజ్ చేసి గోదావరిలో ముంచారన్నారు. గోదావరి ప్రవాహాన్ని కట్టడి చేసే నిర్మాణం కుంగి పోయిందని తెలిపారు. ’‘మీకు చిన్నా చితక సమస్య కావొచ్చు, స్పిల్ వే భద్రత, డయా ఫ్రమ్ వాల్ కుంగింది.. మీరు ప్రజలకు ఎం సమాధానం చెబుతారు?’’ అని ప్రశ్నించారు. రివర్స్ టెండర్ డ్రామాలో జగన్ రెడ్డి కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నీ మూర్ఖత్వం వల్ల డయా ఫ్రామ్ వాల్ కొంతమేర దెబ్బతిన్నదని అన్నారు. దెబ్బతిన్న పనులను మీడియా చూపిస్తుందని అందరిని కట్టడి చేశారని విమర్శించారు. 31 మంది ఎంపీలు ఢిల్లీలో గడ్డి పీకుతున్నారన్నారు. పోలవరం దేశానికీ గుండె కాయ లాంటి ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు. 195 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచాల్సి ఉందని.. దాన్ని 91 టీఎంసీలకు తగ్గించి, నిర్వాసితులను గోదావరిలో ముంచేశారని మండిపడ్డారు. పోలవరం డ్యామ్‌ను నట్టేట ముంచేశారన్నారు. పోలవరం పాపాలన్నింటికీ జగన్ రెడ్డి నిర్ణయాలే కారణమని ఆరోపించారు. వరద వచ్చే సమయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని.. రైతులకు సమాధానం చెప్తారని దేవినేని ప్రశ్నించారు.

స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఉప సభాపతి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారన్నారు. పోలీస్ యంత్రంగానికి కొంతమంది పోలీసుల వల్ల చెడ్డ పేరు వస్తోందన్నారు. లోకేష్ పాదయాత్రకు రక్షణ కల్పించాలని అచ్చేనాయుడు కోరారని.. ఏ చిన్న సంఘటన జరిగినా జగన్ రెడ్డి బాధ్యతలు వహించాలని డిమాండ్ చేశారు. కిట్ల పంపిణిలో కమిషన్ కక్కుర్తి కోసం పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తావా జగన్ రెడ్డి అంటూ నిలదీశారు. మండుటెండల్లో పిల్లలను స్కూల్‌కు రమ్మనడం, నీ బడాయి చూపించడానికి జూన్12న కిట్లు పంపిణి చేయడం దారుణమన్నారు. అధికారులకు బాధ్యత లేదా? అని ప్రశ్నిస్తూ.. రాష్ట్రం లో రాక్షస పాలన నడుస్తోందన్నారు. త్రాగునీరు లేక ప్రజలు, పశువులు అల్లాడి పోతున్నాయన్నారు. మైలవరం ఎమ్మెల్యేకు సిగ్గు ఉండాలని.. మంచినీరు అందించలేని మీరు ఎమ్మెల్యేలుగా ఎందుకయ్యా సిగ్గుండాలి అంటూ దేవినేని ఉమా వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-06-09T16:17:27+05:30 IST