Share News

Bhuvaneshwari: మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుంది

ABN , First Publish Date - 2023-10-27T14:19:51+05:30 IST

మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబు చొరవతో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు అయ్యిందని తెలిసి గర్వ పడ్డానన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై 'నిజం గెలవాలి' అని ప్రజలతో కలిసి పోరాడుతున్నానన్నారు.

Bhuvaneshwari: మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుంది

అమరావతి: మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చంద్రబాబు చొరవతో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు అయ్యిందని తెలిసి గర్వ పడ్డానన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై 'నిజం గెలవాలి' అని ప్రజలతో కలిసి పోరాడుతున్నానన్నారు. ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఈ కష్ట సమయంలో తమకు ఎంతో ఊరటనిస్తోందన్నారు. వారిచ్చే మద్దతు ఎంతో ధైర్యాన్నిస్తోందని అన్నారు. తనను కలిసిన ప్రజలు చంద్రబాబు పాలనలో జరిగిన మంచి గురించి, నేటి రాక్షస పాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన టీసీఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి చంద్రబాబు చొరవతో ఈ సంస్థ ఏర్పాటు అయిందని చెప్పినప్పుడు ఎంతో గర్వపడ్డానన్నారు. ఇవన్నీ చూశాక మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని మరింత దృఢంగా చెప్పగలుగుతున్నాను అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు.


కాగా.. తిరుపతి జిల్లాలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ భరోసా యాత్ర 3వ రోజు కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనోవేదనకు గురై మరణించిన కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. ఈరోజు (శుక్రవారం) ఏర్పేడు మండలం మునగళ్లపాళ్యం గ్రామం ప్రారంభం నుంచి గ్రామ వాసులను పలుకరించుకుంటూ ముందుకు వెళ్లారు. యంగిటీల వసంతమ్మ కుటుంబాన్ని చంద్రబాబు సతీమణి పరామర్శించారు. 30 ఏళ్లుగా టీడీపీతోనే ఉన్నామని.. భువనేశ్వరి మేడం ఆవేదనలో ఉన్నా తమ ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. నారా భువనేశ్వరి పిలుపు అయిన నిజం గెలవాలికి అండగా ఉంటామని వసంతమ్మ కుటుంబం పేర్కొంది.

Updated Date - 2023-10-27T14:47:39+05:30 IST