Skill Development Case: లోకేష్ ముందస్తు బెయిల్ ఈనెల 12వ వరకు పొడిగింపు
ABN , First Publish Date - 2023-10-04T15:46:10+05:30 IST
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముందస్తు బెయిల్‌ను అక్టోబర్ 12కు హైకోర్టు పొడిగించింది. లోకేష్ ముందస్తు బెయిల్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... లోకేష్ ముందస్తు బెయిల్ ఈ రోజుతో ముగుస్తుందని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు.
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Nara lokesh) ముందస్తు బెయిల్‌ను అక్టోబర్ 12కు హైకోర్టు (AP High Court) పొడిగించింది. లోకేష్ ముందస్తు బెయిల్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... లోకేష్ ముందస్తు బెయిల్ ఈ రోజుతో ముగుస్తుందని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేవని సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేయాలని కోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. దీంతో అప్పటి వరకూ లోకేష్‌కు ముందస్తు బెయిల్ పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.