Lokesh: బెయిల్‌ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్.. లోకేశ్ సెటైర్

ABN , First Publish Date - 2023-09-23T11:40:21+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 38 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ గత పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారంటూ.. బెయిల్ డే వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు.

Lokesh: బెయిల్‌ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్.. లోకేశ్ సెటైర్

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 38 కేసుల్లో ఏ1గా ఉన్న జగన్ గత పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారంటూ.. బెయిల్ డే వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు. ‘‘బెయిల్ డే ప‌దో వార్షికోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు జైలు మోహ‌న్. రూ.42 వేల కోట్లు ప్ర‌జాధ‌నం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా ప‌దేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్ర‌వాది జైలు మోహ‌న్‌ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడు . జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే, జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్ (Chandrababu) జైలులో ఉన్నారు’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. .

Updated Date - 2023-09-23T11:40:21+05:30 IST