AP Assembly: వీడియోలు తీస్తున్నారంటూ అచ్చెన్న, అశోక్ సస్పెండ్

ABN , First Publish Date - 2023-09-22T10:13:54+05:30 IST

ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బెందాల్లం అశోక్‌ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సభలో వీడియోలు తీస్తున్నారంటూ చీఫ్ విఫ్ ప్రసాదరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు.

AP Assembly: వీడియోలు తీస్తున్నారంటూ అచ్చెన్న, అశోక్ సస్పెండ్

అమరావతి: ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ సభ్యులు (TDP Members) సస్పెండ్ అయ్యారు. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు (Atchannaidu), బెందాల్లం అశోక్‌ను (Bendalam Ashok) ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం (AP Assembly Speaker Tammineni Sitaram) ప్రకటించారు. సభలో వీడియోలు తీస్తున్నారంటూ చీఫ్ విఫ్ ప్రసాదరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు అచ్చెన్న, అశోక్‌ను సభలో ఫోన్‌లో వీడియోలు తీస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. నిన్న (గురువారం) సభ్యులకు వార్నింగ్ ఇచ్చినా సభలో వీడియో తీస్తున్నారని.. వారిని ఈ సభ నుంచి ఈ షెషన్ మొత్తం సస్పెండ్ చేయాలన్నారు. దీంతో వీడియో తీస్తున్న అచ్చెన్నాయుడు, బెందాల్లం అశోక్‌ను ఈ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేస్తునట్టు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.


కాగా.. టీడీపీ నేతల నిరసనలతో ఏపీ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభ మొదలైనప్పటి నుంచి ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తెలుగు దేశం ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో సభ కాసేపు వాయిదా పడింది. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలోనూ సైకో పాలన పోవాలి అంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. మంత్రి జోగి రమేష్ (Minister Jogi Ramesh) మాట్లాడుతూ.. చంద్రబాబును భేషరుతుగా విడుదల చేయాలని ప్లకార్డులు కోర్టు వద్దకు తీసుకు వెళ్ళాలన్నారు. సైకో ఆల్రడీ బోక్కలో ఉన్నారంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. సైకోగాళ్లు అందరూ సభకు వచ్చి పక్కోదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్‌ను పొట్టన పెట్టకున్న చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) ఇప్పడు జైల్‌లో ఉన్నారన్నారు. చంద్రబాబు అవినీతి బట్టబయలు అయినందునే రాజమండ్రి సెంట్రల్ జైలులో 7691 ఖైదీ నెంబర్‌తో ఉన్నారని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-22T10:13:54+05:30 IST