Undavalli Sridevi : సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రాణహాని ఉంది: ఉండవల్లి శ్రీదేవి
ABN , First Publish Date - 2023-03-26T12:38:30+05:30 IST
నాలుగేళ్ళ పాటు తనను వాడుకుని పిచ్చికుక్క మాదిరి ముద్రవేసి బలి చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. క్రాస్ ఓటింగ్ ఆరోపణల అనంతరం నేడు ఆమె హైదరాబాద్‌లో తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు.
హైదరాబాద్ : నాలుగేళ్ళ పాటు తనను వాడుకుని పిచ్చికుక్క మాదిరి ముద్రవేసి బలి చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. క్రాస్ ఓటింగ్ ఆరోపణల అనంతరం నేడు ఆమె హైదరాబాద్‌లో తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డితో తనకు ప్రాణహాని ఉందని వాపోయారు. సజ్జలపై నేషనల్ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తానన్నారు. తనను వైసీపీ గూండాలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో నేను లేకుండా చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. బ్రదర్ గా అన్నీ చూసుకుంటానన్న జగన్ విలువలను తుంగలో తొక్కారు.
సీక్రెట్ ఓటింగ్ లో వాస్తవాలు తెలుసుకోకుండానే నన్ను బలిచేశారు. ప్రాణం పోయినా సరే.. రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తాను. అమరావతి ప్రాంతంలో రైతుల పక్షాన స్వతంత్ర ఎమ్మెల్యేగా పోరాడుతాను. జగనన్న ఇళ్ళ పథకం అతి పెద్ద స్కాం. అమరావతి మట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నా.. ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. దోచుకో.. పంచుకో అనేదే వైసీపీ ప్రభుత్వం సిద్ధాంతం. నా ఇంట్లో గంజాయి పెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నారు. మహిళా ఎమ్మెల్యేకు రక్షణలేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తా. NHRC హామీ ఇస్తే ఏపీలో అడుగుపెడతా. నాపై ఆరోపణలు చేసినవారికి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. జగన్ కొట్టిన దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయింది. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరాలనే ఆలోచన లేదు. ఈరోజు నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని. నియోజకవర్గ ప్రజలు వస్తే సమస్యలపై పోరాడదాం’’ అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి...