YCP Leaders: అనకాపల్లిలో వైసీపీ నేతలకు చేదు అనుభవం
ABN , First Publish Date - 2023-04-10T10:30:29+05:30 IST
వైసీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది.
అనకాపల్లి: జిల్లాలో వైసీపీ నేతల (YCP Leaders)కు చేదు అనుభవం ఎదురైంది. అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ నిర్వాసిత కాలనీలో ‘‘జగన్ నువ్వే మా నమ్మకం’’ స్టిక్కర్లను ఇంటింటికి అంటించేందుకు వచ్చిన వైసీపీ నేతలను స్థానికులు అడ్డుకున్నారు. స్థానిక కంపెనీలో కళాసీలుగా పనిచేస్తున్న తమను ఇబ్బంది పెడుతూ ఇప్పుడు స్టిక్కర్లు అంటించడానికి వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి వైసీపీ నేతలు వెనుదిరిగారు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ‘‘జగన్ నువ్వే మా నమ్మకం’’ అంటూ అంటిస్తున్న స్టిక్కర్లలో వివాదం చెలరేగుతోంది. ప్రభుత్వ ఆదేశం ప్రకారం ప్రతీ ఇంటికి తప్పనిసరిగా వైసీపీ నేతలు స్టిక్కర్లను అంటిస్తున్నారు. ఎవరు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు అని తెలుసుకునేందుకే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగా అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్ కాలనీలో స్టిక్కర్లు అంటించేందుకు వెళ్లిన వైసీపీ నేతలు, వాలంటీర్లను గ్రామస్థులు అడ్డుకున్నారు. వైసీపీ నేతలతో వారు వాగ్వివాదానికి దిగారు. కళాసీలుగా పనిచేస్తున్న తమను ఎమ్మెల్యే, పార్టీ నేతలు ఇబ్బందులు పెడుతున్నారని, ఉపాధి కూడా లేకుండా చేస్తున్నారంటూ గత వారం రోజులుగా గ్రామస్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన వైసీపీ నేతలను గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ ఉపాధిని దెబ్బతీశారంటూ.. అలాంటి మీరు తమ గ్రామంలో స్టిక్కర్లు ఏవిధంగా అంటిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు ఏం చేసిది లేక వెనుదిరిగి వెళ్లిపోయారు. అంతేకాకుండా విశాఖ జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.