AP Minister: ఏపీ భూములపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి అమర్నాథ్

ABN , First Publish Date - 2023-06-23T16:16:46+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో అమరజ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌‌లోని భూములపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణలో కంటే ఏపీలోనే భూముల ధరలు ఎక్కవని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు.

AP Minister: ఏపీ భూములపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి అమర్నాథ్

అనకాపల్లి: తెలంగాణ రాష్ట్రంలో అమరజ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌‌లోని భూములపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Telangana CM KCR) చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తెలంగాణలో కంటే ఏపీలోనే భూముల ధరలు ఎక్కవని చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మంత్రి అమర్నాథ్ (Minister Amrnath) మాట్లాడుతూ.. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఏపీలో కంటే తెలంగాణలో భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ఎక్కడో చెప్పిన మాటలను కేసీఆర్ కాపీ కొట్టి అవే మాటలను అనడం సిగ్గుచేటని విమర్శించారు. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం వచ్చి ల్యాండ్ రేట్లు తెలుసుకొని మాట్లాడాలన్నారు. ఇక్కడ ఎకరా రేట్‌కు తెలంగాణలో 150ఎకరాలు కొనొచ్చు అని.. ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి అంటూ హితవుపలికారు. శుక్రవారం యలమంచిలి నియోజకవర్గం అచ్చుతాపురం మండలంలో గడపగడపకు వైసీపీ విజయోత్సవ సభలో మంత్రి అమర్‌నాథ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఏమన్నారంటే...

తెలంగాణలో ఎకరం అమ్మితే ఆ డబ్బుతో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో వందెకరాలు కొనొచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందనేది దీని ద్వారానే తెలుస్తోందన్నారు. ఇటీవల తెలంగాణ అభివృద్ధి చెందుతోందంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనవచ్చునని ఇటీవల చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. చంద్రబాబు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకూడదని కోరుకున్నారని, ఇప్పుడు ఆయనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, ఏపీ వెనుకబడుతోందని అంటున్నారని.. ఆయన ఈ వ్యాఖ్యలు వాస్తవమేనని పేర్కొన్నారు.

Updated Date - 2023-06-23T16:21:03+05:30 IST